ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499గా నిర్ణయించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2250 డిస్కౌంట్ లభిస్తుంది.