- Telugu News Photo Gallery Technology photos Oneplus launches new mid range budget smartphone OnePlus Nord 4 features and price details
OnePlus Nord 4: 28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్… వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్
అటు ప్రీమియం బడ్జెట్‌తో పాటు, తక్కువ బడ్జెట్‌తో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్న వన్‌ప్లస్ తాజాగా మార్కెట్లోకి మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్4 పేరుతో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ 3కి కొనసాగింపుగా, ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 17, 2024 | 11:10 PM

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో.. 6.74 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1.5 కే రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఇక బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీ బ్యాంక్, వన్ కార్డ్‌తో కొనుగలు చేస్తే ఈ ఫోన్‌పై రూ. 3000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను మెర్క్యురియల్ సిల్వర్, అబ్సిడియన్ మిడ్‌నైట్, ఒయాసిస్ గ్రీన్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

oneplus nord4

జులై చివరి వారంలో ప్రీ బుకింగ్స్ మొదలుకాగా ఆగస్టు 2వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి. OnePlus అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆన్ని ఈ కామర్స్ సైట్స్, రిటైల్ షాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

ధర విషయానికొస్తే 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.29,999, 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.32,999, 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.35,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను మెర్క్యురియల్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, అబ్సిడియన్ మిడ్‌నైట్ కలర్స్‌లో తీసుకొచ్చారు.




