AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi 14: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 20 వేలకిపైగా తగ్గింపు.

ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలు సేల్స్‌తో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమీకి చెందిన స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది...

Xiaomi 14: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 20 వేలకిపైగా తగ్గింపు.
Xiaomi 14
Narender Vaitla
|

Updated on: Jul 17, 2024 | 7:14 PM

Share

ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలు సేల్స్‌తో సంబంధం లేకుండా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమీకి చెందిన స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? ఎంత తగ్గింపు ధర లభిస్తోంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం షావోమీ 14పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 79,999గా లాంచ్‌ చేశారు. ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో సూపర్‌ ఫీచర్లను తీసుకొచ్చారు. అయితే తాజాగా అమెజాన్‌లో ఈ ఫోన్‌పై 13 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 69,998కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను ఏకంగా రూ. 20 వేల తగ్గింపు ధరకే పొందొచ్చు. వీటితోపాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 54,900 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

షావోమీ 14 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయాకొస్తే ఇందులో 6.36 ఇంచెస్‌తో కూడిన 1.5కే రిజల్యూషన్‌తో కూడిన ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందించారు. దీంతో స్క్రీన్‌ను సన్‌ లైట్‌లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3, 4ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇక ఈ ఫోన్‌లో 50 వాట్స్‌ ఫాస్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో పాటు, 120 వాట్స్‌ హైపర్‌ ఛార్జర్‌కు సపోర్ట్ చేసే 4610 బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. మొత్తం మూడు 50 ఎంపీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. అయితే ఈ ఆఫర్‌ ఎన్ని రోజులు ఉంటుందన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us