- Telugu News Photo Gallery Technology photos Now users can do contact lenses payments with smart watch, Airtel and noise launching new watch
Smartwatch: ఇకపై స్మార్ట్‌వాచ్‌తోనే పేమెంట్స్.. మార్కెట్లోకి కొత్త వాచ్
ఒకప్పుడు వాచ్ అనేది కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక గ్యాడ్జెట్ మాత్రమే. కానీ కాలక్రమేణ స్మార్ట్ వాచ్ అందుబాటులోకి రావడంతో వాచ్ రూపమే మారిపోయింది. ఇప్పుడు వాచ్‌తో చేయలేని పని లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ కాల్ మొదలు, హెల్త్ ట్రాక్ వరకు అన్ని రకాల పనులను వాచ్‌తోనే చేసే రోజులు వచ్చాయి. అయితే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త వాచ్ వచ్చింది..
Updated on: Aug 30, 2024 | 12:31 PM

స్మార్ట్ వాచ్‌లు రోజురోజుకీ రూపాన్ని మార్చుకుంటున్నాయి. కొంగొత్త ఫీచర్లతో కూడిన వాచ్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌టెల్ పేమెంట్స్, నాయిస్ కలిసి మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది.

బుధవారం గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ ప్రముఖ స్మార్ట్‌వాచ్ కంపెనీ నాయిస్‌తో కలిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు.

త్వరలోనే ఈ వాచ్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీకి సపోర్ట్ చేసేలా ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. ఇకపై యూజర్లు ఫోన్ లేకుండా కేవలం వాచ్‌తోనే యూపీఐ పేమెంట్స్ చేసే సౌకర్యం లభించనుంది.

ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే రూ. 5000 వరకు పేమెంట్స్‌ను చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ ఫోన్‌లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ రూపే చిప్‌ను అమర్చారు. కేవలం ఫోన్‌ను పేమెంట్ విడైజ్ దగ్గర టచ్ చేస్తే చాలు వెంటనే పేమెంట్ పూర్తవుతుంది.

ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. బాడీ టెంపరేచర్, హార్ట్ బీట్ రేట్, బీపీ చెకింగ్, హెల్త్ ఫిట్‌నెస్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ వాచ్ 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. త్వరలోనే ఈ వాచ్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.




