- Telugu News Photo Gallery Technology photos These are the best gaming smartphones under 20k, Check here for full details
Gaming phones: తక్కువ బడ్జెట్‌లో గేమింగ్ ఫోన్స్ కోసం చూస్తున్నారా.?
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌ను గేమింగ్ కోసం కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మంచి ప్రాసెసర్‌తో కూడిన ఫోన్‌లను విక్రయిస్తున్నారు. కంపెనీలు సైతం గేమింగ్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తూ కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇలా రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి.? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 31, 2024 | 12:19 PM

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్స్ ఫోన్స్‌లో ఐక్యూ జెడ్9ఎస్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 17,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.77 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం.

మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు సపోర్ట్ చేసేలా ఈ ఫోన్‌లో 4ఎన్‌ఎమ్ మీడియాటెక్ డైమెన్షన్ 7300 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఇందులో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు.

వన్‌ప్లస్ నార్డ్ సీటీ 4 లైట్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గేమింగ్ లవర్స్ కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 వంటి పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 19,999గా ఉంది.

ఇక వన్‌ప్లస్ నార్డ సీఈ 4 లైట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్-హెచ్‌డి+ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. బ్యాటరీ పరంగా చూస్తే 80 వాట్స్ వైర్డ్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ కెపాసిటీతో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు.

మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి వివో టీ3 కూడా ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇ్వనున్నారు. ఈ స్క్రీన్ 1800 నిట్స్ పీక్ బ్రైన్‌నెస్‌ను అందిస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌లో 4nm MediaTek డైమెన్షన్ 7200 ప్రాసెసర్‌ను అందించారు. దీంతో ఈ ఫోన్ ఎలాంటి స్ట్రక్ లేకుండా గేమింగ్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో 4 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట చేే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.




