- Telugu News Photo Gallery Technology photos Oppo launching new earbuds with low budget Oppo Enco Air 4 Pro features and price
Oppo Enco Air 4 Pro: తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్.. ఒప్పో నుంచి సరికొత్త ఇయర్ బడ్స్
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఎక్నో ఎయిర్ 4 ప్రో పేరుతో వీటిని తీసుకొచ్చారు. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో వీటిని లాంచ్ చేశారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి గ్లోబల్ మార్కెట్‌లో సేల్స్ ప్రారంభంకానున్నాయి. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 31, 2024 | 12:47 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఒప్పో గ్లోబల్ మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఎక్నో ఎయిర్ 4 ప్రో పేరుతో వీటిని లాంచ్ చేశారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో ఎక్నో ఎయిర్ 4 ప్రో ఇయర్ బడ్స్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. ప్రీమియం 12.4 mm డ్రైవర్ సెటప్‌ను అందిస్తున్నారు. AI నాయిస్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో స్పష్టమైన క్లారిటీతో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా 43 గంటలపాటు నాన్ స్టాప్‌గా పనిచేస్తుందని కంపెనీ చెబతోంది. ప్రీమియం 20-20KHz ఫ్రీక్వెన్సీ సెటప్‌ను అందించనున్నారు. బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది.

ఇక ఇందులో డ్యూయల్-మైక్రోఫోన్ AI నాయిస్ వంటి అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను అందిస్తున్నారు. ఇందులో 58 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. అలాగే వీటి కేస్‌లో 440 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇచ్చారు.

ఇక వాటర్ రెసిస్టెంట్ కోసం ఇందులో ఐపీ55 రేటింగ్‌ను అందించారు. టచ్ ఇంటరాక్షన్ సపోర్ట్‌ను అందించారు. వీటి బరువు కేవలం దాదాపు 4.2 గ్రాములుగా ఉంటుంది. ధర విషయానికొస్తే మన కరెన్సీలో రూ. 2100గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.




