- Telugu News Photo Gallery Technology photos Lines on roads: yellow line, white line on road do you know facts about road lines
Lines on Roads: రహదారులపై ఇలాంటి పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఎన్నో అర్థాలు
రహదారి చుట్టూ అనేక రకాల సంకేతాలు ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, వాహనం నడుపుతున్న వ్యక్తి మాత్రమే దానిని సరిగ్గా అర్థం చేసుకోగలడు. కానీ సాధారణంగా డ్రైవర్లకు కూడా కొన్ని సంకేతాల పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది. అయితే, జీవితం, మరణం మధ్య వ్యత్యాసాన్ని వివరించే అనేక సంకేతాలు ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడుకోవచ్చు..
Updated on: May 29, 2024 | 4:14 PM

రహదారుపై ఇలాంటి పసుపు, తెలుపు గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఎన్నో అర్థాలు రహదారి చుట్టూ అనేక రకాల సంకేతాలు ఉన్నాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే, వాహనం నడుపుతున్న వ్యక్తి మాత్రమే దానిని సరిగ్గా అర్థం చేసుకోగలడు. కానీ సాధారణంగా డ్రైవర్లకు కూడా కొన్ని సంకేతాల పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది. అయితే, జీవితం, మరణం మధ్య వ్యత్యాసాన్ని వివరించే అనేక సంకేతాలు ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. అయితే మనం రోడ్డుపై వాహనాలు నడుపుతూ వెళ్తున్నప్పుడు కొన్ని రకాల గీతలు కనిపిస్తుంటాయి. అవి తెలుపు, పసుపు రంగుల్లో రోడ్లపై గీతలు ఉంటాయి. వాటి అర్థాలు చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఆ గీతల అర్థాలు ఏంటో తెలుసుకుందాం.

బ్రోకెన్ వైట్ లైన్: బ్రోకెన్ వైట్ లైన్ అంటే రోడ్డు మధ్యలో కొంత దూరంలో ఉన్న లైన్ అని అర్థం. రహదారిపై ఇటువంటి లైన్లు రహదారిని రెండు భాగాలుగా విభజిస్తాయి. ఇక్కడకు ఇరువైపుల నుంచి ట్రాఫిక్ ఉంటుంది. డ్రైవర్ తన ఎడమ వైపున ఉండాలని సూచిస్తాయి ఈ తెలుపు రంగు గీతలు.

కంటిన్యూయస్ వైట్ లైన్: ఈ రకమైన తెలుపు రంగు గీతలు రోడ్డుపై పూర్తిగా ఉంటాయి. ట్రాఫిక్ మొత్తం ఎడమవైపు మాత్రమే కదలాలని ఇది సూచిస్తుంది. ఇలాంటి గీత ఉన్నట్లయితే మీరు ఓవర్‌టేక్ చేయడానికి లేదా యూ టర్న్ తీసుకోవడానికి అనుమతి ఉండదని అర్థం.

ఈ రకమైన లైన్‌లో మీరు ఓవర్‌టేక్ చేయడానికి, యూ-టర్న్ తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈ రకమైన రహదారిలో మీరు ఇతర వాహనాలను అధిగమించవచ్చు. లేదా యూ టర్న్ కూడా తీసుకోవచ్చు అని అర్థం.

రహదారిపై ఇటువంటి పసుపు రంగులో పూర్తిగా గీతలు ఉన్నట్లయితే ఈ రోడ్డు వంపులు తిరిగి ఉందని అర్థం. అలాంటి సమయంలో పసుపు రేఖను దాటితే శిక్ష విధించవచ్చు. రోడ్డు వంపులు ఉన్నందున ఎదురుగా వచ్చే వాహనాలతో ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. అందుకే పసుపు రంగు గీత ఉన్నట్లయితే ఆ గీతను దాటకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా కంటిన్యూగా పసుపు గీత ఉంటే ఈ లైన్ రహదారి పక్కన వాహనాలను పార్క్ చేయడానికి అనుమతి ఉండదని అర్థం.

కంటిన్యూ తెలుపు రంగు గీత: రహదారిపై కంటిన్యూగా తెలుపు లేదా పసుపు రంగు గీతలు ఉంటే వాహనాలు ఈ రేఖను దాటకుండా ఉండాలని అర్థం. పసుపు లేదా తెలుపు ఏదైనా రంగు కావచ్చు. ఇలా కంటిన్యూగా గీతలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో గీతను దాటవద్దని అర్థం. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.




