iQoo Neo 9 Pro: లాంచింగ్‌కు సిద్ధమైన ఐక్యూ కొత్త ఫోన్‌.. సూపర్‌ ఫీచర్స్‌

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఐక్యూ నియో9 ప్రో గురించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కొత్త ఫోన్‌ లాంచింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు. ఇంతకీ ఫోన్ల ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Feb 18, 2024 | 10:08 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ భారత్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఐక్యూ నియో9 పేరుతో ఈ నెల 22న భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నారు.

1 / 5
ఇక ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 920 నైట్ విజన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌ సొంతం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు.

2 / 5
అలాగే ఐక్యూ నియో9 ప్రో ఫోన్‌లో 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్మార్ట్ ఫోన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లాంచ్‌ చేస్తున్నారు.

3 / 5
ఐక్యూ నియో 9 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో 120 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్, ఆడియో జాక్‌ను అందిస్తున్నారు.

4 / 5
ఇక ధర విషయానికొస్తే ఐక్యూ నియో 9 ప్రో ప్రారంభ వేరియంట్‌ను రూ. 34,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్‌ లభించనుందని సమాచారం. ఫిబ్రవరి 22న ఈ ఫోన్‌ లాంచ్‌ అవుతుండగా సేల్స్‌ ఎప్పటి నుంచి మొదలవుతాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

5 / 5
Follow us