Galaxy M34 5G: సామ్‌సంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 15వేలలోనే 5జీ ఫోన్‌.

స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు ఆఫర్లు కురిపిస్తున్నాయి. గతంలో లాంచ్‌ అయిన ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఇప్పటికే పలు చైనా స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ కంపెనీలు డిస్కౌంట్‌లు ప్రకటించగా. తాజాగా సామ్‌సంగ్‌ సైతం భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Feb 18, 2024 | 10:40 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌34 పేరుతో గతేడాది జులైలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.

1 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌34 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర లాంచింగ్‌ సమయంలో రూ. 18,999కాగా 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 20,999గా ఉండేది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై ఏకంగా రూ. 3000 డిస్కౌంట్‌ అందిస్తోంది.

2 / 5
దీంతో డిస్కౌంట్‌ పోయిన తర్వాత ఈ ఫోన్‌లను వరుసగా రూ. 15,999, రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను ఐసీఐసీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో బేసిక్‌ వేరియంట్‌ను రూ. 15వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లూ, ప్రిసమ్‌ సిల్వర్‌, వాటర్‌ఫాల్‌ బ్లూ వంటి కలర్స్‌లో అందుబాటులో ఉంది.

3 / 5
ఫీచర్ల విషయానికొస్తే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌34 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1080x2340 పిక్సెల్ రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ 1280 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

4 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us