- Telugu News Photo Gallery Technology photos Amazon offering 70 percent discount on TAGG Verve NEO Smartwatch have a look on features
TAGG Verve: వెయ్యి రూపాయలకే రూ. 4 వేల స్మార్ట్ వాచ్… ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 10 రోజులు
స్మార్ట్ వాచ్‌లపై ఈకామర్స్ సైట్స్‌లో భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు పది వేలు పెడితే కానీ దొరకని స్మార్ట్ వాచ్ ఇప్పుడు వెయ్యి రూపాయలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా అమెజాన్ సైట్‌లో ఇలాంటి ఓ బిగ్ డీల్ ఉంది. టాగ్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 75 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఏంటా డీల్.? ఆ స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఏంటో.? ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 28, 2023 | 6:42 PM

TAGG Verve NEO స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 3,999కాగా అమెజాన్‌లో ఏకంగా 75 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంటే ఈ స్మార్ట్ వాచ్‌ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.69 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.

అలాగే రియల్ టైమ్ బ్లూడ్ ఆక్సిజన్ ఎస్‌పీఓ2 ఫీచర్‌ను సైతం ఇచ్చారు. స్లీప్ ట్రాకింగ్, మహిళల కోసం ప్రత్యేకం నెలసరి ట్రాకింగ్, 60 స్పోర్ట్స్ మోడ్స్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు.

ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో లిథియం బ్యాటరీని ఇచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 10 రోజులు నిర్వీరామంగా పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ బరువు కేవలం 21 గ్రాములు మాత్రమే ఉంటుంది. గేమ్స్‌తో పాటు క్యాలిక్యులేటర్ వంటివి కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ మీ స్లీపింగ్ సమయాన్ని ట్రాకింగ్ చేస్తుంది.

బ్లూ, గ్రే, ఆర్‌ఎస్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే 500 ఎన్‌ఐటీఎస్ బ్రైట్‌నెస్‌ను రిలీజ్ చేస్తుంది. హార్ట్ మానిటరింగ్ ఫీచర్‌ను సైతం ఇందులో అందించారు.





























