- Telugu News Photo Gallery Technology photos These are the smart phones under 30,000, A festival for gaming lovers
SmartPhones Under 30,000: ముప్పై వేల లోపు అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు ఇవే.. గేమింగ్ ప్రియులకు పండగే
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. భారతదేశ జనాభాలో అత్యధికులు యువకులే ఉన్నారని అందరికీ తెలిసిందే. గతంలో ఆటలు అంటే గ్రౌండ్‌కు వెళ్లి ఆడేవారు. కానీ ప్రస్తుతం స్మార్ట్ గేమ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారి కోసం కంపెనీలు కూడా గేమింగ్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో రూ.30 వేల లోపు అందుబాటులో ఉన్న గేమింగ్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Jul 28, 2023 | 7:30 PM

టెన్సర్ చిప్‌సెట్‌తో వచ్చే గూగుల్ పిక్సెల్ 6 ఏ ఫోన్ 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 12 ఎంపీ కెమెరాతో పని చేసే ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 7 ఏ రిలీజ్ అయ్యాక ఈ ఫోన్‌పై అదిరిపోయే తగ్గింపు ధరలతో వస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,999కు అందుబాటులో ఉంది.

అమెజాన్‌లో రూ.27,999కు అందుబాటులో ఉన్న ఐక్యూ నియో 7 5 జీ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ 6.78 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్‌లో 64 ఎంపీ కెమెరా ఆకర్షణీయంగా ఉంటుంది. గేమింగ్ ప్రియులను ఈ ఫోన్ విపరీతంగా ఆకర్షిస్తుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇటీవల రిలీజ్ చేసిన రియల్ మీ 11 ప్రో ఫోన్ గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర రూ.25,550గా ఉంది.

రెడ్‌మీ కే 50 ఐ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6.6 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరకే గేమింగ్ ఫోన్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ రూ.20,999గా ఉంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రో ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.22,379 అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ పని చేసే ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.





























