- Telugu News Photo Gallery Technology photos Airtel bring some features in airtel thank app for corona patients about oxygen beds and vaccination process
Airtel Thanks App Covid 19: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాప్‌లో కరోనా సంబంధిత పూర్తి సమాచారం..
Airtel Thanks App Covid 19: కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేయడానికి ఇప్పటికే పలు సోషల్ మీడియా సైట్లు సమాచరం అందిస్తూ తమ వంతు కృషిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌యాప్‌లో వ్యాక్సినేషన్‌తోపాటు, కరోనా సంబంధిత వివరాలను పొంది పరిచింది...
Updated on: May 22, 2021 | 3:26 PM

దేశంలో కరోనా సంక్షోభం ఉదృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మహమ్మారి నుంచి ప్రజలను గట్టెక్కించడానికి అన్ని వ్యవస్థలు ఏకమవుతున్నాయి.

ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థలన్నీ కరోనాకు సంబంధించిన అన్ని వివరాలను యూజర్లకు అందచేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీచర్లు కూడా ప్రవేశపెట్టాయి.

తాజాగా ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాలం కంపెనీ ఎయిర్‌టెల్ తన యూజర్లకు అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలను అందిస్తోంది.

ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కొవిడ్ అత్యవసర సేవల సమాచారాన్ని అందించడం ప్రారంభించింది.

ఆక్సిజన్, ప్లాస్మా దాతలు, అంబులెన్స్, హాస్పిటల్‌లో బెడ్లు, టెస్టింగ్ కేంద్రాల వంటి ముఖ్యమైన సమాచారంతో పాటు వ్యాక్సినేషన్ స్లాట్‌లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని యాప్ ద్వారా అందిస్తోంది.

ఇందు కోసం థాంక్స్ యాప్‌లోని ఎక్స్‌ప్లోర్ సెక్షన్‌లో కొవిడ్ సపోర్ట్, సంబంధిత సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇతరుల కోసం కూడా వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.




