Eye Care: ఉదయాన్నే నిద్ర లేచాక మీ కళ్ల కింద వాపు కనిపిస్తుందా? అయితే వెంటనే ఇలా చేయండి..
కొంత మందికి ఉదయాన్నే నిద్రలేవగానే కళ్ల కింద ఉబ్బినట్లు వాపు కనిపిస్తుంది. దీని వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడిపోతుంటారు. ఇలాంటి వారు ఇంట్లోనే చిన్నపాటి చిట్కాతో సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు..
Updated on: Oct 31, 2024 | 1:27 PM

జుట్టు, చర్మ సంరక్షణకు కొబ్బరి నూనె చాలా ఉపయోగకరమైనది. పొడవాటి, ఒత్తైన జుట్టు పొందడానికి కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. కానీ ఇది జుట్టు సంరక్షణకే కాకుండా చర్మ సంరక్షణకు, అందాన్ని పెంపొందించడానికి కూడా బలేగా పని చేస్తుంది. మేకప్‌ను తొలగించుకోవడానికి కూడా దీనిని వినియోగించవచ్చు.

కొంతమందికి ప్రతి రోజూ నిద్ర లేచిన తర్వాత కళ్ల ఉబ్బినట్లు, వాపు కనిపిస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు కళ్ల కింద కొబ్బరినూనెను మసాజ్ చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరికి వివిధ కారణాల వల్ల కళ్ల కింద వాపు వస్తుంది. కొందరికి దద్దుర్లు, దురదలు వస్తాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. రోజంతా ఫోన్ చూస్తూ ఉండడం, నిద్ర సరిగా పట్టకపోవడం, వృద్ధాప్యం వల్ల ఈ సమస్యలు వస్తాయి. కొబ్బరినూనెను కళ్ల కింద రాసుకుని చేతులతో మసాజ్ చేయడం వల్ల సమస్య నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చు.

కొందరికి చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తుంటాయి. రకరకాల సౌందర్య సాధనాలను ఉపయోగించడం వల్ల ఇలా చర్మం దెబ్బతింటుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని బిగుతుగా చేసి కరుకుదనాన్ని తగ్గిస్తాయి.

దద్దుర్లు, దురదలు, ఎరుపు వంటి చర్మ సమస్యల నుంచి బయటపడటానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంపొందించడమే కాకుండా మీ చర్మాన్ని మృదువుగా చేయడం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొబ్బరి నూనె కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మానికి పోషణనిస్తుంది. అలాగే చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. కళ్ల కింద వాపు లేదా దురద, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.




