- Telugu News Photo Gallery Super Foods: These super foods must include in your regular diet for better health
Super Foods for Women: ప్రోటీన్ లోపాన్ని తరిమే ఆహారాలు.. మహిళలు వీటిని తప్పక తీసుకోవాలి
నేటి బిజీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా మహిళలకు కొన్ని ముఖ్యమైన పోషకాలు అవసరం. ప్రోటీన్‌తో కూడిన ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే కండరాల బలహీనత ఏర్పడి తీవ్ర సమస్యలు దాడి చేస్తాయి. ఆరోగ్యమైన ఆహారంలో పాలకూర ఉత్తమమైనది. పాలకూర శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో..
Updated on: Aug 16, 2024 | 12:56 PM

నేటి బిజీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా మహిళలకు కొన్ని ముఖ్యమైన పోషకాలు అవసరం. ప్రోటీన్‌తో కూడిన ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే కండరాల బలహీనత ఏర్పడి తీవ్ర సమస్యలు దాడి చేస్తాయి.

ఆరోగ్యమైన ఆహారంలో పాలకూర ఉత్తమమైనది. పాలకూర శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో ఇది ఉపయోగపడుతుంది. మెగ్నీషియం సాధారణంగా కండరాలు, నరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. శరీరానికి శక్తిని అందించి గుండె, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలను బలపరుస్తుంది. కాల్షియం బోలు ఎముకల వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ పెరుగును పంచదార కలిపి తింటే మాత్రం ఇది జరగదు. బదులుగా, పోషక విలువలను పెంచడానికి పెరుగులో కొన్ని తరిగిన పండ్లను జోడించి తినవచ్చు.

శక్తిని పెంచుకోవడానికి డార్క్ చాక్లెట్, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ, డార్క్ చాక్లెట్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాక్లెట్‌లో ఉండే కోకోలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఓట్స్‌ని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులోని ప్రోటీన్ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఫలితంగా ఎముకలు దృఢంగా మారుతాయి.

టొమాటోలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా వయస్సుతో పెరుగుతుంది. కాబట్టి టమోటాలు తినడం మంచిది.బంగాళదుంపలలో అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా బంగాళాదుంపలలో కొంత మొత్తంలో విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను బలపరుస్తుంది. శరీరంలో శక్తిని నిర్వహించడానికి తృణధాన్యాలు కూడా తినవచ్చు.




