- Telugu News Photo Gallery Skin Care Tips: Tips and tricks to remember while taking care of your skin
Skin Care Tips: చందమామ లాంటి మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ అస్సలొద్దు
అందమైన చర్మం కావాలని ప్రతి అమ్మాయి కలలు కంటుంది. కానీ కలలు కనడం మాత్రమే సరిపోదు.. అందుకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మెరిసే చర్మం కావాలనుకుంటే, సరైన చర్మ సంరక్షణ అవసరం. అందుకు కాలుష్యం, అనారోగ్య ఆహార అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రిళ్లు అధిక సమయం మేల్కొని ఉండడం వల్ల కూడా మన చర్మం దెబ్బతింటుంది. అంతేకాదు మేకప్ విషయంలో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తుంటారు..
Updated on: Aug 16, 2024 | 1:14 PM

అందమైన చర్మం కావాలని ప్రతి అమ్మాయి కలలు కంటుంది. కానీ కలలు కనడం మాత్రమే సరిపోదు.. అందుకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మెరిసే చర్మం కావాలనుకుంటే, సరైన చర్మ సంరక్షణ అవసరం. అందుకు కాలుష్యం, అనారోగ్య ఆహార అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రిళ్లు అధిక సమయం మేల్కొని ఉండడం వల్ల కూడా మన చర్మం దెబ్బతింటుంది. అంతేకాదు మేకప్ విషయంలో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తుంటారు. ఇవి కూడా చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ముఖ్యం శుభ్రం చేసుకోవడానికి సరైన ఫేస్ వాష్‌లను ఎంచుకోవాలి. ఎందుకంటే మన చర్మం నిరంతరం కాలుష్యానికి గురవుతూనే ఉంటుంది. దీంతో చెమట రంధ్రాలు మూసుకుపోతుంటాయి. ఫలితంగా మొటిమలు సహా వివిధ సమస్యలు వస్తాయి. సున్నితమైన చర్మం కలిగిన వారు ఈ సమస్యల నివారణకు సువాసన లేని క్లెన్సర్‌లను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. కానీ pH బ్యాలెన్స్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.

ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. కాబట్టి వారి చర్మ తత్వాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి మొటిమలు, కొంతమందికి పిగ్మెంటేషన్ సమస్య అధికంగా ఉంటుంది. ఇటువంటి వారు చర్మవ్యాధి నిపుణుల సలహాతో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

అలాగే ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్ కొనుగోలు చేసే ముందు, ప్యాకింగ్ కవర్‌పై ఉన్న అంశాలను క్షుణ్ణంగా చదవాలి. వీటిల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయో.. లేదో.. తనిఖీ చేసుకోవలి. కాలుష్యం నుంచి ఉపశమనం పొందడానికి మంచి క్లెన్సర్‌లను ఎంచుకోవాలి. చర్మ సంరక్షణలో యాంటీ ఆక్సిడెంట్ల వాడకం కూడా అంతే అవసరం. అప్పుడే చర్మం లోపలి నుంచి పోషణ పొందుతుంది. ఫలితంగా కాంతి పెరుగుతుంది.

చాలా మంది సన్‌స్క్రీన్‌ని ఉపయోగించరు. ఇది సరికాదు. అలా కాకుండా ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. కానీ సన్‌స్క్రీన్‌ను కొనుగోలు చేసే ముందు దానిలో 50 కంటే ఎక్కువ SPF ఉండేలా చూసుకోవాలి. అలాగే అది UVA PA+++ అయి ఉండాలి.




