- Telugu News Photo Gallery Students going to school sitting in JCB Bulldozer in Nirmal District, Mudhole Mandal
Telangana: చదువుకోవాలంటే..ప్రమాదకరంగా ప్రయాణించాల్సిందే.. బస్సు సౌకర్యం లేక జేసీబీ మీద ప్రయాణం
పెను ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. బడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్ సౌకర్యం లేక నడిచి వెళ్లడం తప్ప మరో మార్గం లేక ఆలస్యం అవుతుందనే కారణం తో ఇదిగోఇలా జేసీబీ ప్రయాణాలకు సిద్దపడుతున్నారు.
Updated on: Mar 02, 2023 | 11:35 AM

పెను ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. బడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్ సౌకర్యం లేక నడిచి వెళ్లడం తప్ప మరో మార్గం లేక ఆలస్యం అవుతుందనే కారణం తో ఇదిగోఇలా జేసీబీ ప్రయాణాలకు సిద్దపడుతున్నారు.

ఒకటి కాదు రెండు కాదు 6 కిలో మీటర్లు జేసీబీ లో కూర్చోని ప్రమాద కరంగా ప్రయాణిస్తూ టీవి9 కెమెరాకు చిక్కారు నిర్మల్ జిల్లా ముథోల్ మండల విద్యార్థులు. కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు చేరాలంటే ఇదిగో ఇలా సాహస యాత్ర చేయక తప్పదు. ప్రైవేట్ ఆటోళ్లో వెళ్లే ఆర్థిక స్థోమత లేక లిప్ట్ లు అడిగి మరీ సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు నిర్మల్ జిల్లా కనకాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింత కుంట నుంచి లోకేశ్వరం మండలం కనకపూర్ ప్రభుత్వ పాఠశాలకు 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది.

అయితే అబ్దుల్లా పూర్ మీదుగా విద్యార్థులు స్కూల్ కు వెళ్తారు. ఈ గ్రామాల మధ్య బస్సు, ఇతర వెహికిల్స్ అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం చింతకుంట నుంచి విద్యార్థులు జేసీబీ వెహికిల్ ముందు భాగంలో నిలబడీ మరీ ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తుండగా టీవీ9 వీడియోలో బందించింది.

ప్రమాదకరంగా ఎందుకు ప్రయాణిస్తున్నారని విద్యార్థులను ప్రశ్నిస్తే ఆర్టీసీ బస్ లు నా ఊరికి రావు ఆటోలు లేవు.. బడికి సమయానికి చేరాలంటే ఏం చేయాలి.. ఇలాంటి ప్రయాణాలు ప్రమాద మైనా చేయక తప్పదంటూ విద్యార్థులు సమాదానం ఇచ్చారు.

ఈ రోడ్డు మార్గం అంతా గుంతలమాయంగా ఉండటం.. జరుగారనిది జరిగితే బాద్యులు ఎవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజు ఈ మార్గంలో బస్సు నడిపిస్తే తమ తిప్పలు తీరుతాయని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.
