- Telugu News Photo Gallery Parenting Tips These habits of parents can make children prone to depression
Parenting Tips: తల్లిదండ్రులూ బీ అలర్ట్.. మీరు చేసే ఈ తప్పులు పిల్లల డిప్రెషన్‌కు కారణాలవుతాయి..!
తల్లిదండ్రులు అవ్వటం అనేది ఒక వివాహిత జంటకు వరం. ఇది జీవితంలో గొప్ప ఆనందాల్లో ఒకటి. అయితే, తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యతను నిర్వర్తించడం చాలా కష్టం. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు, అలవాట్లు.. పిల్లలను డిప్రెషన్‌కు గురిచేస్తాయి.
Updated on: Mar 02, 2023 | 1:13 PM

సామర్థ్యానికి మించి పనిభారం: ప్రతి బిడ్డకు తన ప్రత్యేక లక్షణం ఉంటుంది. వారి సామర్థ్యం కంటే ఎక్కువ పని ఇవ్వడం ద్వారా వారిని మరింత బలహీనపరిచినవారవుతారు. తద్వారా వారు తీవ్ర నిరాశకు గురవుతారు.

నిరంతర పర్యవేక్షణ: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టరు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను 24 గంటలు పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఒకరకమైన ఆత్మన్యూనతాభావం కలుగుతుంది. అది వారిని కుంగదీస్తుంది.

కఠినమైన రూల్స్: కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో తమ పిల్లలపై కఠినమైన ఆంక్షలు విధిస్తారు. నియమాలు పెడతారు. అవి వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. మానిసికంగా గందరగోళానికి గురవుతారు. అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

పోలిక: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చుతారు. అలా చేయొద్దు. ఎందుకంటే.. ఎవరి సామర్థ్యం వారిది. పోలుస్తూ చూడటం వల్ల.. పిల్లలు మరింత నిరాశకు గురవుతుంటారు.

షరతులతో కూడిన ప్రేమ: చాలామంది తల్లిదండ్రులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన, మంచి ప్రతిభ కలిగిన పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపుతారు. అలా చేయడం వల్ల మరో బిడ్డ డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

పిల్లలతో స్నేహంగా ఉండాలి: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెరిగేకొద్దీ వారిపై ఒత్తిడి పెంచుతూనే ఉంటారు. బిడ్డ క్రమంగా ఎదుగుతున్నప్పుడు.. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితుడిలా మెలగడం అలవాటు చేసుకోవాలి.

మానసికంగా నిర్లక్ష్యం: కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరాలను అందించడం తమ బాధ్యతగా భావిస్తారు. పిల్లలతో మానసికంగా కనెక్ట్ అవ్వరు. ఇతర పనులలో బిజీగా ఉంటారు. అలా ఉండకుండా.. పిల్లలను మానసికంగా కూడా దగ్గరకు తీసుకోవాలి. వారిపై ప్రేమ చూపించాలి.

కష్ట సమయాల్లో సహాయం చేయాలి: చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను వారి అభివృద్ధి కోసం కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలివేస్తారు. అయితే, కొన్నిసార్లు ఇది పిల్లలపై దుష్ర్పభావం చూపుతుంది. అలా కాకుండా సమస్య పరిష్కారం కోసం కష్ట సమయాల్లో కాస్త భరోసా ఇవ్వాలి.




