ఆహారం ఎలా తినడం మంచిది..? నీటిలో ఉడికించా.. ఆవిరి మీద ఉడికించా… నిపుణుల సలహా ఏమిటంటే..
ఆహరాన్ని రకరకాల పద్దతిలో తయారు చేసుకుని తింటారు. నూనెలో వేయించడం, బొగ్గుల మీద కాల్చడం, ఆవిరి మీద ఉదికించడం, నీటిలో వేసి ఉదికించడం వంటి అనేక రకాల పద్దతిలో ఆహారాన్ని తయారు చేసుకుని తింటారు. అయితే ప్రస్తుతం ప్రజలకు ఆరోగ్యం పట్ల మక్కువ పెరిగింది. దీంతో సంపూర్ణ పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. వేయించిన ఆహారానికి బదులుగా, ప్రజలు ఆవిరిలో ఉడికించినవి , లేదా నీటిలో ఉడికించిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ ఆహారం ఎక్కువ ప్రయోజనకరం. నిపుణుల నుంచి దీనికి సంబంధించిన సరైన సమాధానం తెలుసుకుందాం.
Updated on: Jul 20, 2025 | 4:58 PM

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఆహారాన్ని ఆవిరి మీద ఉడికించడం లేదా ఉడకబెట్టడం ద్వారా తినమని సలహా ఇస్తారు. ఈ రెండు పద్ధతులు ఆహారం నాణ్యత, పోషకాలను కాపాడుకోవడంలో సహాయపడతాయి. అయితే రెండు పద్ధతులు తక్కువ కొవ్వు ఎంపికలు అయినప్పటికీ.. ఉడికించడం కంటే ఆవిరితో ఉదికించడం ఆరోగ్యకరమైన వంట పద్ధతిగా పరిగణించబడుతుంది.

ఆరోగ్యం కోసం ప్రజలు తరచుగా కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకున్తున్నారు. కొంతమంది పచ్చిగా తింటే.. మరికొందరు ఉడికించి తింటున్నారు. అయితే డైరెక్ట్ గా నీటిలో వేసి ఉడికించడం కంటే.. కూరగాయలను ఆవిరి మీద ఉడకబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వీటిల్లో ఉండే నీటిలో కరిగే విటమిన్లు బి, సి వంటి పోషకాలకు నష్టం కలిగిస్తుంది. ఆవిరి చేయడం వల్ల ఆహారంలోని పోషక పదార్థాలు బాగా సంరక్షించబడతాయి

ఆహారాన్ని ఆవిరి మీద ఉడికించడం ద్వారా దానిలోని పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఉదాహరణకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహిస్తుంది. మధుమేహ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

అదే సమయం తినే ఆహారాన్ని ఉడకబెట్టడం ద్వారా వండుకుంటే.. అది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలి. ఏది బెస్ట్ ఎంపిక అనే విషానికి వస్తే.. డాక్టర్ గీతికా చోప్రా ఆవిరి మీద ఉడికించిన ఆహారం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.

కూరగాయలను ఆవిరి మీద ఉడికించినప్పుడు వాటిలో విటమిన్లు , ఖనిజాలు కోల్పోవని డాక్టర్ గీతిక వివరిస్తున్నారు. కానీ కూరగాయలను డైరెక్ట్ గా నీటిలో వేసి ఉడకబెట్టినట్లయితే వాటి విటమిన్లు నీటి ద్వారా పోతాయి. ముఖ్యంగా విటమిన్ సి, బి-కాంప్లెక్స్, ఎంజైమ్‌లు నీటిలో కలిసి పోతాయని అన్నారు.

కనుక ఎవరైనా బరువు తగ్గాలనుకున్నా, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకున్నా లేదా మెరిసే చర్మం కావాలనుకున్నా ఆవిరితో ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఆవిరి మీద ఉడికించడం వల్ల కూరగాయల సహజ తీపి, రుచి మెరుగుపడుతుంది. వాటి ఆకృతి కూడా పోదు. దీంతో ఆవిరి మీద ఉడికించిన ఆహారాన్ని తినడానికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది.




