- Telugu News Photo Gallery Sports photos For Price of one Cristiano Ronaldo watch, you can buy this many flats and cars in Hyderabad check footballer collection
వామ్మో.. ఒక్క వాచ్ ధరలో గచ్చిబౌలీలో ఏకంగా 10 ఫ్లాట్లు కొనేయోచ్చు.. ఈ ప్లేయర్ కలెక్షన్ చూస్తే మూర్ఛపోవాల్సిందే
Cristiano Ronaldo: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన క్రీడలకే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. రొనాల్డోకు ఖరీదైన వాచీలంటే చాలా ఇష్టం. వీటిలో ఒక్కటి కొనుగోలు చేయాలన్నా సామాన్యులు భారీ సాహసం చేయాల్సిందే. అసలు ఆయన వద్ద ఉన్న వాచ్చీల ఖరీలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 09, 2024 | 1:15 PM

Cristiano Ronaldo: ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జాబితాలో చేరిన క్రిస్టియానో రొనాల్డో తన ఆటతీరుతో వార్తల్లో నిలిచాడు. ఈ పోర్చుగీస్ ఆటగాడు అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక గోల్స్ చేసిన మొదటి ముగ్గురి ఆటగాళ్లలో చేరాడు. రొనాల్డోకు ఖరీదైన కార్లతో పాటు ఖరీదైన వాచీలంటే చాలా ఇష్టం.

అతను తరచుగా మైదానంలో ఉన్నప్పుడు ఏదో ఒక వాచ్ ధరించి కనిపిస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రొనాల్డో వాచీల విలువ లక్షల్లో ఉంటుంది. నివేదికలను విశ్వసిస్తే, ఒక సామాన్యుడు ఈ వాచీలలో ఒకదాన్ని కొనుగోలు చేసే బదులు.. ఇదే ధరతో హైదరాబాద్ గచ్చిబౌలీలో దాదాపుగా 8 ఫ్లాట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అదే ధరకు ఎన్నో కార్లను కొనుగోలు చేయవచ్చంట.

రొనాల్డోకు గిరార్డ్ పెర్రెగాక్స్ కంపెనీ వాచ్ ఉంది. నివేదికల ప్రకారం ఈ వాచ్ ధర దాదాపు రూ.16 కోట్లు. ఈ కంపెనీ చాలా ఖరీదైన గడియారాలకు ప్రసిద్ధి చెందింది. రొనాల్డో వద్ద ఫ్రాంక్ ముల్లర్ సింట్రీ కర్వెక్స్ టూర్‌బిల్లాన్ వాచ్ కూడా ఉంది. దీని ధర దాదాపు రూ.12 కోట్లు.

జాకబ్ & కో బ్రాండ్ రొనాల్డో కోసం ప్రత్యేక వాచ్‌ని డిజైన్ చేసింది. ఈ వాచ్ ధర కూడా లక్షల రూపాయల్లోనే ఉంది. రొనాల్డోతో ఉన్న ఈ వాచ్ ఫోటోను బ్రాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

రొనాల్డో బిలియన్ల ఆస్తికి యజమాని అని తెలిసిందే. అతని వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. రొనాల్డోకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 620 మిలియన్లకు పైగా ప్రజలు అతనిని అనుసరిస్తున్నారు.




