ఈ 25 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటర్.. 24 ఏళ్ళ రికార్డును తిరగరాశాడు. సరిగ్గా 2000 సంవత్సరంలో భారత్‌పై సనత్ జైసూర్య 189 పరుగులు కొట్టి.. వన్డేలలో శ్రీలంకన్ బ్యాటర్ అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును తన పేరిట రాసుకున్నాడు నిస్సాంక. అలాగే గేల్(138), సెహ్వాగ్(140) బంతుల్లో డబుల్ సెంచరీ సాధించగా.. నిస్సాంక కేవలం 136 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించి.. వారి రికార్డును బద్దలు కొట్టాడు. ఈ డబుల్ సెంచరీతో వన్డేలలో మొట్టమొదటి శ్రీలంకన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు నిస్సాంక.