- Telugu News Photo Gallery Sports photos fifa world cup 2022 opening ceremony performance by jung kook and morgan freeman see photos
Fifa World Cup: అట్టహాసంగా ప్రారంభమైన FIFA ప్రపంచ కప్.. స్పెషల్ సాంగ్ తో అదరహో అనిపించిన BTS సింగర్ జంగ్ కుక్
వివాదాల మధ్య అందమైన ఏడారి దేశం ఖతార్‌లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకలో.. ఖతార్ తన సాంస్కృతిక సంప్రదాయాల కార్యక్రమాలతో పాటు అంతర్జాతీయ మ్యూజిక్ షోలను కూడా జోడించింది.
Updated on: Nov 21, 2022 | 11:52 AM

అనేక సంవత్సరాల వివాదాల తర్వాత.. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 ఎట్టకేలకు ఖతార్‌లో ప్రారంభమైంది. ఆదివారం అల్ బైత్ స్టేడియం వేదికగా వేలాది మంది ప్రేక్షకులు, నిర్వాహకులు, ఫిఫా అధికారులు, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమల్ అల్ థానీ సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభ వేడుకలు జరిగాయి

FIFA ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన అతి చిన్న, మొదటి అరబ్ దేశమైన ఖతార్.. ప్రారంభ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తన సంస్కృతి ప్రపంచ దేశాలకు, ఫుట్ బాల్ అభిమానులకు పరిచయం చేసింది. తమ దేశంలో ఫుట్‌బాల్ ప్రారంభం గురించి సమాచారాన్ని అందించింది.

ప్రారంభ వేడుకల డైరెక్టర్‌గా ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ ఈ బాధ్యతను స్వీకరించారు. ఈ వేడుకల్లో ఖతార్ ప్రపంచ కప్ అంబాసిడర్ ఘనిమ్ అల్ ముఫ్తాతో అనేక విషయాలను ముచ్చటించారు.

దక్షిణ కొరియాకు చెందిన సూపర్ స్టార్ మ్యూజిక్ బ్యాండ్ BTS సభ్యుడు జంగ్ కుక్ తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సమయంలో.. డజన్ల కొద్దీ కళాకారులతో కలిసి ప్రపంచ కప్ కోసం సిద్ధం చేసిన 'డ్రీమర్స్' పాటపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. విద్యుత్ కాంతులు, బాణ సంచాకు తోడు మ్యూజిక్ కూడా తోడు కావడంతో ఈ విజువల్స్ చూసిన వారంతా వావ్ అంటున్నారు.

ఈ సమయంలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాల్ అల్ థానీ, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో కూడా స్టేడియంలో ఉన్నారు.

దాదాపు 60 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన అల్ బయాన్ స్టేడియంలో టోర్నీలో భాగంగా తోలి మ్యాచ్ జరిగింది. ఆతిథ్య ఖతార్ ఈక్వెడార్‌తో తలపడింది. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




