- Telugu News Photo Gallery Sports photos Beer ban at World Cup 2022: Here are things World Cup fans are restricted from doing in Qatar
FIFA World Cup 2022: అందుకే ఫీఫా ఫుడ్‌బాల్ ప్రపంచకప్‌కు తీవ్ర వ్యతిరేకత.. లేదంటే జైలుకే..!
సాకర్ ప్రపంచ కప్ 202కు ఆతిథ్యం ఇస్తున్న తొలి గల్ఫ్ దేశం ఖతార్. ఇంటా బయటా ఎన్నో విమర్శలపాలౌతుంది. గత కొన్ని దశాబ్దాల్లో ఏ ప్రపంచకప్‌కూ లేని వ్యతిరేకత, విమర్శలు ఈ టోర్నీ విషయంలో ఎదురవుతున్నాయి..
Updated on: Nov 20, 2022 | 1:55 PM

సాకర్ ప్రపంచ కప్ 202కు ఆతిథ్యం ఇస్తున్న తొలి గల్ఫ్ దేశం ఖతార్. ఇంటా బయటా ఎన్నో విమర్శలపాలౌతుంది. గత కొన్ని దశాబ్దాల్లో ఏ ప్రపంచకప్‌కూ లేని వ్యతిరేకత, విమర్శలు ఈ టోర్నీ విషయంలో ఎదురవుతున్నాయి.

వాతావరణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ జూన్-జులై నెలల్లో జరిగే టోర్నీని నవంబరు-డిసెంబరు నెలలకు వాయిదా వేయడంపై వ్యతిరేకత ఉంది.

దీనితోపాటు స్టేడియాల్లో ప్రేక్షకులకు కొన్ని కొత్త రూల్స్ పెట్టింది. నిజానికి ఖతార్ ఒక ఇస్లామిక్ దేశం. ఈ దేశంలో మహిళల వస్త్రధారణపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీంతో ఫిఫా ప్రేక్షకులు భుజాలు, కాళ్లు పూర్తిగా కప్పి ఉంటే దుస్తులు మాత్రమే ధరించాలని ఆంక్షలు విధించింది. ఈ నిబంధనల కేవలం మహిళలలకు మాత్రమేకాదు. పురుషులకు కూడా వర్తిస్తుందట. దీంతో ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

స్టేడియం లోపల మద్యం, వైన్, బీర్ల అమ్మకాన్ని నిషేధించడం. ఈ నిర్ణయం వల్ల ఖతార్ ప్రభుత్వానికి కోట్లలోనష్టం వాటిల్లనుంది.

పెళ్లికాని జంటలకు హోటళ్లలో గదులు నిషేధం. స్వలింగ సంపర్కులకు ఖతార్ స్టేడియంలోకి ప్రవేశం నిషేదం. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని హెచ్చిరించింది కూడా. అలాగే అభ్యంతరకర పోస్టర్లు, నినాదాలు కూడా నిషేధమే. ఫిఫా సైతం దీనిపై అసంతృప్తితో ఉంది. ఇన్ని వ్యతిరేకత మధ్య ప్రపంచకప్‌ను ఖతార్ ఏవిధంగా నిర్వహించి మెప్పిస్తుందోననే ఉత్సుకత కూడా లేకపోలేదు.




