- Telugu News Photo Gallery Sports photos Chahal's Post Divorce Comeback: RJ Mahwash's IPL Support Sparks Dating Rumors
కమ్‌బ్యాక్ ఇచ్చిన చాహల్! ఆ బాధ నుంచి బయటపడేందుకు కారణం ఆమెనా?
యుజ్వేంద్ర చాహల్ తన విడాకుల తర్వాత ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఆర్జే మహవాష్ అనే వ్యక్తి పలు మ్యాచ్‌లకు హాజరై చాహల్‌ను ప్రోత్సహిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని అభిమానులు భావిస్తున్నారు. చాహల్ కేకేఆర్‌పై 4 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
SN Pasha |
Updated on: Apr 16, 2025 | 8:39 PM

ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తొలిసారి ఓ మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చాటాడు. కేకేఆర్‌పై 4 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. అయితే.. ఈ కమ్‌బ్యాక్‌కు ఆర్జే మహవాష్ కారణం అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు దర్శనమిస్తున్నాయి.

ఆర్జే మహ్‌వాష్ ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరువుతోంది. అది కూడా యుజ్వేంద్ర చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు సపోర్ట్ చేస్తోంది. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్‌వాష్ యుజ్వేంద్ర చాహల్, పంజాబ్ కింగ్స్ జట్టును ఎంకరేజ్ చేస్తూ కనిపించింది.

ఆర్జే మహవాష్ మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కనిపించింది. అలాగే, మ్యాచ్ తర్వాత మహవాష్ సోషల్ మీడియాలో చాహల్‌తో సెల్ఫీ ఫోటోను షేర్ చేసింది. "వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్.. ఇందుకే అతను ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయ్యాడు. అసంభవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ మొదటి మూడు ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీనితో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది.