- Telugu News Photo Gallery Cricket photos These 7 Players Including Yuzvendra Chahal, MS Dhoni Glorious Return Won Player Of The Match Awards In IPL 2025
IPL 2025: తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు.. ఈ 7గురు ప్లేయర్స్‌కి ఐపీఎల్ జాక్‌పాట్
ఐపీఎల్ 2025 కొందరు వెటరన్ ప్లేయర్స్‌కి ప్రాణం పోసింది. గత కొన్నేళ్ళుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నోచుకోని ఈ ఆటగాళ్లు.. ఇప్పుడు అద్భుత ఆటతో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Apr 16, 2025 | 6:08 PM

IPL 2025 ఏడుగురు ఆటగాళ్లకు ఒక వరంలా మారింది. ఎన్నేళ్ల నుంచి ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ.. ఇప్పటికి సఫలీకృతం అయింది. జీరో నుంచి హీరోగా అయ్యారు ఈ ఏడుగురు ప్లేయర్స్. వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

మహేంద్ర సింగ్ ధోని, కర్ణ్ శర్మ, జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, క్వింటన్ డికాక్, యుజ్వేంద్ర చాహల్ ఈ లిస్టులో ఉన్నారు. విజయాల్లో కీలక పాత్ర పోషించి వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నారు.

IPL 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతోన్న కర్ణ్ శర్మ.. సుమారు 8 సంవత్సరాల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అతడు చివరిసారిగా IPL 2017లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు.

కర్ణ్ శర్మతో పాటు IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న జోఫ్రా ఆర్చర్ కూడా 7 సంవత్సరాల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అటు జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా 2-3 సీజన్లలో ఐపీఎల్ ఆడలేదు.

రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన నితీష్ రాణా 4 సంవత్సరాల తర్వాత IPL 2025లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అతను చివరిసారిగా KKR తరపున ఆడినప్పుడు ఈ అవార్డును సాధించాడు.

మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అంతకముందు 2019 తర్వాత తొలిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించాడు ధోని.

డికాక్ మాదిరిగానే మూడు సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

Ipl 2025 4 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ 2025లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన క్వింటన్ డికాక్‌కు కూడా 3 సంవత్సరాల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.7





























