Weekly Horoscope: వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24, 2024 వరకు): మేషరాశి వారికి ఈ వారం ఆదాయం పెరగడమే తప్ప తరగడం అంటూ ఉండదు. ఇంటా బయటా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల విషయంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశాలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 18, 2024 | 5:01 AM

1 / 13
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): లాభస్థానంలో శని, ధన స్థానంలో రాశ్యధిపతి కుజుడు, గురువు ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయం పెరగడమే తప్ప తరగడం అంటూ ఉండదు. ఇంటా బయటా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నందువల్ల కొన్ని మనసు లోని కోరికలు నెరవేరుతాయి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆలయాలు సందర్శించడం, దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో అధికా రులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

2 / 13
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశిలో గురువు సంచారం చేస్తున్నంత కాలం ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో మాత్రం శ్రమాధిక్యత కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం చాలా మంచిది.  ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల విషయంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు చాలా వరకు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరందుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో అనుకోని అపార్థాలు తలెత్తుతాయి. విద్యార్థులు చదు వుల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.

3 / 13
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యదిపతి బుధుడు ధన స్థానంలో, రవి తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక, ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశాలున్నాయి. ఆర్థిక లావా దేవీలు, షేర్లు వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.  ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

4 / 13
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ధన స్థానంలో రవి, శుక్రులు, లాభ స్థానంలో కుజ, శనులు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించిన లాభాలను తీసుకు వస్తాయి. సాధారణంగా ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవు తుంది. వ్యాపారంలో కార్యకలాపాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. కుటుంబపరంగా కొత్త బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. తల పెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు వసూలవుతుంది. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.

5 / 13
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ స్థానంలో గురు, కుజుల సంచారం కొనసాగుతున్నందువల్ల ఉద్యోగ జీవితం వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.  ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది.  వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొందరు బంధువుల నుంచి విమర్శలను వినడం జరుగుతుంది. విద్యార్థులు బాగాశ్రమపడితే తప్ప విజయాలకు అవకాశం ఉండదు. ఆరో గ్యం పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వాగ్దానాలు చేయడం చాలా మంచిది.

6 / 13
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో, గురువు భాగ్య స్థానంలో, శని షష్ట స్థానంలో సంచారం చేస్తు న్నందువల్ల, అనేక విధాలుగా ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అయి, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయ టపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు, శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. విద్యా ర్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

7 / 13
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆరవ స్థానంలో రాహువు, లాభ స్థానంలో రవి, శుక్రులు ఈ రాశివారికి కొండంత అండగా నిలబడడం జరుగుతుంది.  ముఖ్యమైన ఆదాయ, ఆస్తి వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు.  తలపెట్టిన వ్యవహారాలు, పనులు, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు, చేర్పులు జరుగుతాయి.  ఉద్యోగపరంగా కొత్త లక్ష్యాలు, కార్యక్రమాలు మీ ముందుకు వస్తాయి.  వ్యాపారాల్లో మీ సొంత ఆలోచనలు లాభాలను తీసుకు వస్తాయి.  విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

8 / 13
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): నాలుగవ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో పనిభారం, వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, తప్పకుండా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. సప్తమంలో ఉన్న రాశ్య ధిపతి కుజుడు, గురువు వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమ వుతుంది. అనుకోకుండా ఒకటి రెండు ధన యోగాలు పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సంద ర్శిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడడం ప్రారంభిస్తాయి. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.

9 / 13
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): తృతీయ స్థానంలో శని, భాగ్య స్థానంలో భాగ్యాధిపతి రవి సంచారం వల్ల ఆదాయం దిన దినాభి వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది.  ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు బాగా తగ్గి పోతాయి. ఉద్యోగ జీవితంలో నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.  అధికారులు మీ సలహాలు, సూచనలకు విలువనిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.  వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది.  విద్యార్థులు పురోగతి సాధి స్తారు.  ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

10 / 13
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో ధనాధిపతి శని, తృతీయంలో రాహువు, పంచమంలో గురు, కుజులు, సప్తమంలో బుధుడు మంచి రాజయోగాలనిచ్చే అవకాశం ఉంది. సమాజంలో రాజపూజ్యాలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు వృద్ధి చెందుతాయి. కొందరు బంధు మిత్రుల విషయంలో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.  ముఖ్యమైన పనులు, వ్యవహారాలు చకచకా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశిం చిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

11 / 13
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థంలో ఉన్న గురు, కుజులు, సప్తమంలో ఉన్న శుక్రుడి వల్ల కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆర్థిక వ్యవ హారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.  బంధు వుల రాకపోకల వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. పిల్లల చదువులు సజావుగా  సాగిపోతాయి.  ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా కొనసాగుతుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమ యం బాగుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి.

12 / 13
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు తృతీయంలో ధన స్థానాధిపతి కుజుడితో కలిసి ఉన్నందువల్ల ఆదాయ ప్రయ త్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా, సజావుగా సాగిపోతాయి.  ఆర్థిక లావాదేవీలు విజయవంతం అవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులన్నిటినీ  పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు పరవా లేదనిపిస్తాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

13 / 13
Follow us