కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థ స్థానంలో గురు, కుజులు, సప్తమంలో శుక్ర, బుధులు కుటుంబపరంగానే కాక, దాంపత్య పరంగా కూడా సుఖ సంతోషాలను కలిగిస్తారు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవ కాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. కొందరు బంధు మిత్రులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అవసర సమయాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు అండగా ఉంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.