వాస్తు టిప్స్ : దీపావళి రోజు ఇలా చేస్తే.. సంపద రెట్టింపు అవ్వడం ఖాయం!
జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి రోజూ లక్ష్మీ కటాక్షం కలగడానికి పూజలు చేస్తుంటారు. అయితే ఇంటికి ఆనందం, శాంతి కలగాలి, సంపద పెరగాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం .
Updated on: Oct 15, 2025 | 4:21 PM

దీపావళి పండుగ వచ్చేస్తోంది. అక్టోబర్ 21 రోజున ప్రతి ఒక్కరూ ఈరోజున పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా మంది ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎన్నో పూజలు, పనులు చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్ర నిపుణులు మాత్రం దీపావళి పండగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంట్లో సంపదపెరగడానికి కొన్ని చిట్కాలు చెప్పారు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

దీపావళి పండుగ సమయంలో ఇంటి ప్రధాన ద్వారాన్ని నీటుగా శుభ్రంగా ఉంచుకోవాలంట. చెత్త చెదారం ఏం ఉండకూడదు. అదే విధంగా మీ ఇంటి ముందు రంగు రంగుల పూలతో అలంకరించి, ఇంటి ముందు దీపాలు పెట్టి లక్ష్మీ దేవిని అలంకరించాలంట. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంట్లో సంపద పెరుగుతుందంట.

అదే విధంగా ఈశాన్య దిశలో దీపం వెలిగించాలంట. ఈశన్య దిశలో దీపం వెలిగించడం వలన ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుందంట.

దీపావళి అంటే ఇంటిని అందంగా దీపాలతో రెడీ చేయడం, ఇల్లు మొత్తం దీపావళి వెలుగులతో అందంగా తయారవుతుంది. అయితే కొందరు ఇంటిలో ఒక్క దీపం మాత్రమే వెలిగిస్తారు. కానీ అస్సలే అలా వెలిగించకూడదంట. ప్రతి గదిలో కనీసం రెండు దీపాలు వెలిగించాలని చెబుతున్నారు పండితులు. అలాగే ఈ శాన్య దిశలో ఒక దీపం పెట్టడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట.

అదే విధంగా తప్పకుండా ఇంటిలో సంపద పెరగాలంటే, దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి చిత్రపటాలను కొనుగోలు చేసి, ఇంటిలో పెట్టుకోవడం మంచిదంట.అదే విధంగా బంగారం, వెండితో చేసిన లక్ష్మీదేవి నాణెలు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.



