- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: How many idols should be kept in the temple of the house?
Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి గుడిలో ఉంచే దేవుని విగ్రహాల గురించి కొన్ని నియమాలున్నాయి…
Vastu Tips: ప్రతి హిందువు ఇంట్లో దేవుడికి ఒక గది ఉంటుంది. అందులో దేవుడి పటాలను, విగ్రహాలను పెట్టి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే కొంతమంది దేవుడి మందిరంలోరకరకాల దేవుళ్లనే కాదు.. ఒకే దేవుడి విగ్రహాలను ఒకటికంటే ఎక్కువగా పెడుతారు. అయితే వాస్తు శాస్త్రంలో ఇంటి గుడిలో ఉంచే దేవుని విగ్రహాల గురించి కొన్ని నియమాలున్నాయి.
Updated on: Nov 22, 2021 | 10:01 PM

దేవుడి విగ్రహాన్ని ఎప్పుడూ గుడిలో కానీ, ఇంటిలో లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా దేవుడి వెనుక భాగం కనిపించేలా ఉంచకూడదు. విగ్రహం ముందు నుంచి కనిపించేలా పెట్టుకోవాలి. భగవంతుడి వెనుక వైపు దర్శనం శుభప్రదం కాదు.

పూజా మందిరంలో ఎప్పుడూ రెండు కంటే ఎక్కువ విగ్రహాలు ఉంచకూడదు. అంతేకాదు విఘ్నేశ్వరుడి విగ్రహాలను, చిత్ర పటాలను ఉంచకూడదు. ఒకటి కంటే గణపతి విగ్రహాలుంటే శ్రేయస్కరం కాదు.

ఇంట్లో ఒకే ప్రాంతంలో ఒక దేవుడి పటాలు రెండు ఉండకూడదు. అయితే ఇంట్లో రెండు వేర్వేరు ప్రదేశాలలో ఒకే దేవుని రెండు చిత్రాలు ఉండవచ్చు.

ఇంట్లో యుద్ధ భంగిమలో, ఉగ్రరూపం ఉన్న దేవుడి విగ్రహం లేదా చిత్రపటాలను ఉంచకూడదు.

ఇంట్లో ఉంచుకునే దేవుని విగ్రహాలను సున్నితంగా, అందంగా, ఉండి ఆశీర్వాద భంగిమతో ఉండాలి. ఇలాంటి దేవుడి చిత్ర పటాలు సానుకూల శక్తిని ప్రసారం చేస్థాయి.

ఇంట్లోనే పగిలిన విగ్రహాలను, చిరిగిన దేవుడి పటాలను ఉంచుకోరాదు. వెంటనే వాటిని నిమజ్జనం చేయాలి.





























