- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips for Hibiscus Plant : know the benefits of planting this hibiscus plant
Vastu Tips for Hibiscus Plant అనారోగ్య సమస్యలా.. సూర్యుడికి.. మందారం పువ్వులతో ఇలా అర్ఘ్యం సమర్పించండి..
Vastu Tips for Hibiscus Plant : వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వీటిలో ఒకటి మందార మొక్క. మందార పువ్వును పూజలో ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
Updated on: Jun 30, 2022 | 12:53 PM

ఎర్ర మందార పువ్వు దుర్గ మాతకు చాలా ప్రీతికరమైనది. పూజ సమయంలో ఈ పుష్పాలను దేవతలకు సమర్పిస్తారు. ఇంట్లో మందార మొక్కను నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు ప్రకారం, ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు అధిగమిస్తారని నమ్మకం.

మందార మొక్కను ఇంట్లో నాటడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. ఇది ప్రతికూలతను తొలగిస్తుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం ద్వారా ఇంట్లో సుఖ శాంతి నెలకొంటుంది. ఆర్ధిక పురోగతిని సాధిస్తారు. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అందువల్ల, ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

సూర్య భగవానుడు మందార పువ్వుతో పూజిస్తారు. మందార పువ్వులను నీటిలో వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇది జాతకంలో సూర్యు స్థానాన్ని బలపరుస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. మీరు శక్తివంతంగా ఉంటారు. ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే.. అటువంటి వారు రోజూ మందార పువ్వులను నీటిలో వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి.

ఇంట్లో ఈ మొక్కను నాటడం ద్వారా సంబంధాలు బలపడతాయి. కుటుంబ కలహాలు తొలగి సంతోషంగా ఉంటారు. ఈ మొక్కను ఇంట్లో తూర్పు దిశలో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. మందార పువ్వుల గుత్తులుగా పేర్చి.. అందంగా ఇంట్లోని గదుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు.

పూజ సమయంలో, మందార పువ్వును దుర్గాదేవికి, లక్ష్మీదేవికి , హనుమంతుడికి సమర్పించాలి. మంగళ దోషాన్ని తొలగిస్తుంది. డబ్బుకు, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు. దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)




