AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Astrology: గ్రహ దోషాలను లెక్కచేయరు.. ఈ రాశులవారు ఓటమి ఎరుగరు!

జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు అజేయులు. వీరు ఓటమి ఎరుగరు. ఓటమిని అంగీకరించరు. శని దోషాలు, రాహు దోషాలు, కుజ దోషాలు వగైరాలను ఈ రాశుల వారు లెక్క చేయరు. వీరి జీవితాల్లో ఎక్కువగా విజయాలు, సాఫల్యాలే ఉంటాయి. ఈ ఏడాది కూడా అన్నిటా వీరిదే విజయం. వీరు ఉద్యోగం చేసినా, వ్యాపారాలు చేసినా దూసుకుపోవడమే తప్ప చతికిలబడడం ఉండదు. మేషం, వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారు ఎక్కువగా విజయ గాథలను సృష్టిస్తుంటారు.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 08, 2025 | 7:21 PM

Share
మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ఒక పోరాట గ్రహం. వీరిలో శక్తియుక్తులు, ధైర్య సాహసాలు, తెగువ, చొరవ, ఆత్మవిశ్యాసం ఎక్కువ పాళ్లలో కనిపిస్తాయి. కొత్త ప్రయత్నాలన్నా, కొత్తదనం అన్నా ముందు వరుసలో ఉండే ఈ రాశివారు ఎటువంటి ఉద్యోగ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వర్తించే స్థితిలో ఉంటారు. కొత్త వ్యాపారాలను, కొత్త వృత్తులను సృష్టించడంలో వీరికి వీరే సాటి. ఈ ఏడాది ఈ రాశివారు కొత్త చరిత్రలు సృష్టించే అవకాశం ఉంది. సంపదను బాగా పెంచుకుంటారు.

1 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు సంపద, ఆస్తిపాస్తులు, ఉన్నత పదవులు, ఉన్నతస్థాయి జీవనశైలి వంటి లక్షణాలు కలిగిన గ్రహం అయినందువల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని, అధికారం చెలాయించాలని కోరుకుంటారు. పైకి నెమ్మదిగా కనిపించినా ఈ రాశివారిలో దృఢ సంకల్పం ఎక్కువ. వీరిలో ఆర్థిక సంబంధమైన నైపుణ్యాలు, చాతుర్యాలు ఎక్కువ. సంపదను కూడబెట్టుకోవాలన్న కోరిక, అందలాలు ఎక్కాలన్న ఆశయం తప్పకుండా నెరవేరుతాయి.

2 / 6
సింహం: గ్రహ రాజైన రవి గ్రహం ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఈ రాశివారు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శక్తి సామర్థ్యాలకు కొదవ ఉండదు. ఈ రాశివారి పట్ల ఇతరులు తేలికగా ఆకర్షితులవుతారు. ఉద్యోగంలో ఉన్నా, వృత్తి, వ్యాపారాల్లో ఉన్నా వారు తమ రంగం మీద చెరగని ముద్ర వేస్తారు. సొంత బలంతో పాటు గ్రహబలం కూడా తోడవడంతో వీరు ఈ ఏడాది రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

3 / 6
వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ప్రతి పనినీ సాధించుకుంటారు. ఏ పని చేపట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా పూర్తయ్యే వరకు నిద్రపోరు. ధైర్యసాహసాలకు ప్రతీక అయిన ఈ రాశి వారిలో పట్టుదల కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఎటువంటి సవాలునైనా ఎదుర్కునే ఈ రాశి వారు ఉద్యోగంలో రికార్డులు సృష్టిస్తారు. ఉద్యోగం చేస్తున్న సంస్థలో అభివృద్ది పథంలోకి తీసుకువెడతారు. వీరి జీవితం ఒక పోరాటంలో సాగిపోతుంది. విజయాలు వీరిని తేలికగా వరిస్తాయి.

4 / 6
ధనుస్సు: గురువు అధిపతి అయిన ఈ రాశివారిలో యాంబిషన్ ఎక్కువ. ఉన్నత లక్ష్యాలను, ఉన్నతాశయాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకుంటారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, అను కున్నది సాధించడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు. ప్రస్తుతం ఈ రాశివారికి గురు బలం కూడా తోడయినందువల్ల వీరు సంపదను పెంచుకోవడంలో, ఉద్యోగంలో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవడంలో, తమ సంస్థను అభివృద్ది పరచుకోవడంలో ఘన విజయాలు సాధిస్తారు.

5 / 6
మకరం: రాశ్యదిపతి శని సహనం, క్రమశిక్షణ, నీతి నిజాయతీలు, న్యాయవర్తనకు ప్రతీకగా నిలుస్తాడు. ఈ రాశివారు ఈ లక్షణాల వల్ల సాధారణంగా అపజయాల కంటే విజయాలనే ఎక్కువగా చూస్తుం టారు. ప్రతికూలతలు ఎదురైనా మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయాలు సాధిస్తారు. అవిశ్రాం తంగా పనిచేసే తత్వం కలిగిన ఈ రాశివారికి ఈ ఏడాదంతా శని అనుకూలంగా ఉన్నందువల్ల వీరు అటు ఉద్యోగంలోనూ, ఇటు వృత్తి, వ్యాపారాల్లోనూ సత్తా నిరూపించుకుంటారు. సంపదను పెంచుకుంటారు.

6 / 6