- Telugu News Photo Gallery Spiritual photos Surya grahan 2025 date and time know Solar eclipse impact on zodiac
Surya Grahan 2025: ఈ నెల 21న సూర్య గ్రహణం.. ఉత్తరఫల్గుణి నక్షత్రం సహా మూడు రాశులవారికి అన్నీ కష్టాలే.. జాగ్రత్త సుమా..
భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యకాంతి భూమికి చేరదు. ఈ అద్భుతమైన దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇది ఖగోళ శాస్త్రంలోని ముఖ్యమైన సంఘటనలలో ఒకటి. ఈ ఏడాది లో రెండవ చివరి గ్రహణం 2025 సెప్టెంబర్ నెలలో ఏర్పడనుంది. గ్రహణాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నేపధ్యంలో ఈ సూర్య గ్రహణ ప్రభావం వలన కొన్ని రాశుల వారికి సమస్యలు ఏర్పడతాయని వెల్లడించింది. ఆ రాశులు ఏమిటంటే..
Updated on: Sep 09, 2025 | 7:07 AM

గ్రహణాలు ఖగోళంలో అద్భుతమైన దృగ్విషయాలు. ఆధ్యాత్మికంగా గ్రహణాలు ఒక దురదృష్టకమైన సంఘటనగా విశ్వసిస్తారు. అయితే భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు, ఈ పరిస్థితిలో సూర్యకాంతి భూమిని చేరదు. ఈ అద్భుతమైన దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటారు. ఇది ఖగోళశాస్త్రంలో ముఖ్యమైన సంఘటనలలో ఒకటి. ఈ సూర్య గ్రహణం సెప్టెంబర్ 2025 నెలలో మళ్ళీ ఏర్పడనుంది.

ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం భద్రప్రద మాసం కృష్ణ పక్షం అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ 21, 2025న ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ దీనికి ఖచ్చితంగా జ్యోతిషశాస్త్రంలో ప్రాముఖ్యత ఉంది. ఈ సూర్యగ్రహణం కన్య రాశి, ఉత్తర ఫగుణి నక్షత్రంలో సంభవిస్తుంది. అందువల్ల దీని ప్రభావం కారణంగా కొన్ని రాశుల వ్యక్తుల సమస్యలు పెరగవచ్చు. అదే సమయంలో, ఉత్తరఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులపై కూడా ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో సూర్య గ్రహణం వలన ఆరు నెలల పాటు కష్టాలు, సమస్యలు ఎదుర్కొనే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మిథున రాశి వారు చేసే పనిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. కెరీర్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెట్టుబడిలో నష్టం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొత్త పనిని ప్రారంభించవద్దు. అయితే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా పరిస్థితులు మునుపటి కంటే మెరుగ్గా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కళా రంగంలో ఉనట్లు అయితే వారికి లభించే ఫలితాలు సమస్యలను పెంచుతాయి.

కన్య రాశి వారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. పని, ప్రత్యేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ సమయంలో పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు. పిల్లలకు సంబంధించిన ఏదైనా ఆందోళన కూడా కన్య రాశి వారిని బాధపెడుతుంది. వ్యాపారంలో డబ్బు కోల్పోవడం వల్ల ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పరిస్థతి ఉద్రిక్తత ఉంటుంది. అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఓపిక, ధైర్యాన్ని కాపాడుకోండి. అప్పులు అసలు చేయవద్దు. ఈ సమయంలో చేసే అప్పులు తీర్చడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.

ధనుస్సు రాశి వారు ఆఫీసులో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే సమస్యలకు భయపడకుండా.. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ భావజాలంతో సరిపడే వ్యక్తులను కలుస్తారు. కానీ పనికి సంబంధించి సంఘర్షణకు అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వ్యక్తులు అదనంగా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని పాత వ్యాధులు మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.




