- Telugu News Photo Gallery Spiritual photos Two yogas in the month of August will bring financial benefits to the three zodiac signs
ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే.. రెండు యోగాలతో ఇక లక్కే లక్కు..
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం అయితే , మూడు రోజుల రెండు గ్రహాల సంచారం వలన రెండు యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా అదృష్టం తీసుకొచ్చే గజకేసరి యోగం ఏర్పడనుంది. దీని వలన మూడు రాశుల వారి అదృష్టం కలగనుంది. ఆ రాశుల ఏవో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Aug 17, 2025 | 7:22 PM

ఆగస్టు 17,18,19 తేదీల్లో చంద్ర గ్రహం, బుధ గ్రహం సంచారం వలన గజకేసరి రాజయోగం ఏర్పడటమే కాకుండా వీటి సంచారం వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానున్నదంట. వీరి చిరకాల కోరికలు నెరవేరే అవకాశం ఉంది అంటున్నారు పండితులు. ఆ మూడు రాశుల ఏవి అంటే?

తుల రాశి : తుల రాశి వారికి గ్రహాల సంచారం, గజకేసరి రాజయోగం వలన అదృష్టం తలుపు తడుతుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి. స్థిరాస్తికొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు అందుకుంటారు

మిథున రాశి :మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఆదాయం పెరుగుతుంది.ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. నూతన వ్యాపారం చేపట్టాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి.

కన్యా రాశి : కన్యా రాశి వారికి రెండు యోగాల వలన ఆగస్టు నెల మొత్తం అద్భుతంగా ఉండనుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి మీరు ఏవైనా తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

అంతే కాకుండా వైవాహిక బంధంలో ఉన్న సమస్యలు తొలిగిపోయి చాలా సంతోషంగా జీవిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆనందంగా గడుపుతారు.



