- Telugu News Photo Gallery Spiritual photos Shukra Chandra Parivartana Yoga: Positive impacts on these zodiac signs details in Telugu
Parivartan Yoga: శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు!
జ్యోతిషశాస్త్రంలో పరివర్తన యోగాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. పాప గ్రహాల మధ్య పరివర్తన జరిగినప్పుడు ఒక విధంగానూ, శుభ గ్రహాల మధ్య పరివర్తన జరిగినప్పుడు మరో విధంగానూ ఫలితాలుంటాయి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో శుక్ర, చంద్రుల మద్య జరుగుతున్న పరివర్తన శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో శుక్రుడు, శుక్రుడికి చెందిన తులా రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన యోగం కలిగింది. జీవి తాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి, సిరిసంపదలను వృద్ది చేసుకోవడానికి, భోగభాగ్యాలను అనుభవించడానికి ఇది బాగా అనుకూల సమయం. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులకు ఈ పరివర్తన యోగం నూరు పాళ్లు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.
Updated on: Aug 25, 2025 | 6:58 PM

మేషం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన చంద్రుడికి, సప్తమాధిపతి శుక్రుడికి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది.

మిథునం: ఈ రాశికి ధన, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో తప్పకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థాధిపతితో పరివర్తన ఏర్పడడం వల్ల కుటుంబంలో శుభ కార్యాలు జరగడం, సుఖ సంతోషాలు వృద్ధి చెందడం, కుటుంబ సమస్యలన్నీ పటాపంచలు కావడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. సామాజికంగా హోదా, స్థాయి పెరుగుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆదాయానికి లోటుండదు.

కన్య: ఈ రాశికి ధన, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నూరుపాళ్లు సఫలం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ మార్గాల వల్ల విశేష లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు భారీగా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడికి దశమాధిపతి చంద్రుడితో పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సీనియర్లకు ఊహించని పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

మకరం: ఈ రాశికి సప్తమ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా ప్రభుత్వపరంగా కూడా గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు తప్పకుండా సఫలం అవుతారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.



