- Telugu News Photo Gallery Spiritual photos PM Modi to Inaugurate Kashi Vishwanath Corridor on december 13th see how Kashi transformed photos
Varanasi-PM Modi: కాశీ విశ్వనాథ్ కారిడార్‌ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. సరికొత్త అందాలతో వారణాసి కనులవిందు
Varanasi - PM Modi: డిసెంబర్ 13వ తేదీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. వారణాసిలో వివిధ అభివృద్ధి పనులను గురించి పూర్తి సమాచారం మీకోసం
Updated on: Dec 11, 2021 | 9:14 PM

కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్.. విశ్వనాథుడి ఆలయాన్ని గంగా నదికి అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఇంతకు ముందు ఆలయానికి, నదికి ప్రత్యక్ష సంబంధం లేదు. ఇకపై భక్తులు ఎలాంటి అడ్డంకులు లేకుండా గంగానది లలితా ఘాట్‌ను సందర్శించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా చేపట్టిన కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ డిసెంబర్ 13న ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభం కానుంది.

రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ .. దీనిలో అంతర్జాతీయ కచేరీల నుండి ఆర్ట్ ఎగ్జిబిషన్ల వరకు ఏదైనా ఫంక్షన్లను నిర్వహించగల హాలు.

వారణాసిలో రింగ్ రోడ్డు... ఈ రింగురోడ్డు నిర్మాణంతో వారణాసిలో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. అంతేకాదు జాతీయ రహదారిని ఈజీగా చేరుకోవచ్చు.

రో రో వెసెల్స్ పర్యాటకుల కోసం నిర్మించబడ్డాయి.

గోడౌలియాలో బహుళ అంతస్తుల పార్కింగ్‌ను నిర్మించారు. ఇది తీర్థయాత్రీకులకు ఉపయోగపడుతుంది.

వారణాసి లో ఉచిత కేబుల్ వైర్ ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వారణాసిలో ఆరోగ్య సేవల కోసం BHU ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ పడకలను నాలుగు నుంచి 20కి పెంచారు. ఇక్కడ వివిధ ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాశీలో రెండు క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి.

IMS BHUని సందర్శించిన ప్రధాని మోదీ

మాండుడిహ్ రైల్వే స్టేషన్ సరికొత్త రూపాన్ని సంతరించుకుంది.

వాణిజ్యాన్ని సులభతరం చేసే లక్ష్యంతో 2017లో దేనాయద ట్రేడ్ ఫికల్టెడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.

రాత్రి కూడా పట్టగలులా వెలుగులు వెదజల్లుతూ కాశీ విశ్వనాథ్ కారిడార్

అందాలతో కనువిందు చేస్తున్న కాశీ విశ్వనాథ్ కారిడార్

వెలుగులు కాంతిలో కాశీ విశ్వనాథ్ కారిడార్





























