- Telugu News Photo Gallery Spiritual photos Astro Tips For Friday: Astrology Remedies to Improve Financial Status
Astro Tips For Friday: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. శుక్రవారం రోజున ఈ 4 పరిహారాలు చేసి చూడండి..
Astro Tips For Friday: హిందూ సంప్రదాయాలు . భక్తుల విశ్వాసం ప్రకారం, శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి, ఉపవాసం ఉండడం వల్ల ఎలాంటి ఆర్థిక సంక్షోభం రాదని భక్తుల నమ్మకం. ఈరోజు ఆర్ధిక కష్టాలు ఏర్పడిన వారు శుక్రవారం ఏ విధంగా లక్ష్మీదేవిని పూజించాలో తెలుసుకుందాం..
Updated on: Dec 12, 2021 | 2:48 PM

శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి ఎరుపు రంగు దుస్తులను అమ్మవారికి సమర్పించండి. అంతేకాదు లక్ష్మీ దేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, గాజులు వంటి వస్తువులను కూడా సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

శుక్రవారం రోజున ఐదు ఎర్రటి పువ్వులతో మహాలక్ష్మిదేవిని స్తుతించండి. దీని తరువాత, అమ్మవారికి భక్తితో మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ముకుళిత హస్తాలతో నమస్కరించి.. అమ్మవారి ఆశీర్వాదం సదా మీ ఉండాలని కోరుకోండి. అమ్మవారిని పూజించిన పువ్వులను ఎల్లప్పుడూ మీ భద్రంగా ఉంచుకోండి. అంతేకాదు శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీ నారాయణదీని స్తుతించడం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

శుక్రవారం నాడు కిలోన్నర బియ్యాన్ని ఎర్రటి గుడ్డలో కట్టాలి. ఇలా చేసే సమయంలో ఒక్క బియ్యం గింజ కూడా కింద పడకూడదు.ఈ బియ్యం మూటను చేతిలోకి తీసుకుని, 'ఓం మహాలక్ష్మీ నమో నమః' అని ఐదుసార్లు జపించి.. అనంతరం ఈ బియ్యం కట్టిన మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేసే వారి జీవితంలో డబ్బులకు లోటు ఉండదని నమ్మకం.

అంతేకాదు.. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి శుక్రవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం మీరు చేయగల సులభమైన పరిష్కారం. శుక్రవారం లక్ష్మీదేవికి ఉన్న సంబంధం కారణంగా, ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఉండదు.





























