October 2024 Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి మాసఫలాలు

మాస ఫలాలు (అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు): మేష రాశి వారికి రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఈ నెలంతా ఈ రాశివారికి విశేష శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు విజయం సాధించడం జరుగుతుంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి అక్టోబర్ మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 30, 2024 | 8:30 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఈ నెలంతా ఈ రాశివారికి విశేష శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఇందులో బుధ, శుక్ర గ్రహాల అనుకూలత పెరుగుతున్నందువల్ల విదేశీయాన యోగం పట్టే అవకాశం కూడా ఉంది. పెళ్లి సంబంధాల విషయంలో విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవు తాయి. ఆదాయం, ఆరోగ్యం సవ్యంగా సాగిపోతాయి. ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):ప్రస్తుతం తులా రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడు ద్వితీయార్థంలో వృశ్చికంలో ప్రవేశిస్తున్నందు వల్ల పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు విజయం సాధించడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. విలాస జీవితం అలవడుతుంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా మంచి యోగాలు పడతాయి. సమయానుకూలంగా ఆర్థిక ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. దశమంలో శని కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. కొన్ని వ్యవహా రాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. విద్యార్థు లకు శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగం కలిగే అవకాశం ఉంది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ నెలలో శుభ గ్రహాలన్నీ అనుకూలంగా మారుతున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుజ, శుక్ర, బుధ గ్రహాల అనుకూలత పెరగడం వల్ల అన్ని రంగాలవారికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం కూడా సవ్యంగా సాగిపోతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలను ఇతరులతో పంచు కోకపోవడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. విదేశీ యానానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభ వార్తలు వినే సూచనలున్నాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడంలో బాగా ముందుం టారు.

3 / 12

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ, చతుర్థ స్థానాల్లో శుభ గ్రహాలు బాగా అనుకూలంగా సంచారం చేయబోతున్నందువల్ల ఈ నెలంతా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కొన్ని ఊహించని శుభ యోగాలు అనుభ వానికి వస్తాయి. అంతేకాక, నాలుగవ స్థానంలో మూడు గ్రహాలు కలుస్తుండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు, సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారే ప్రయ త్నాలు సఫలం కాకపోవచ్చు. ఇప్పుడున్న ఉద్యోగంలోనే పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారంల్లో జీవిత భాగ స్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంతో పుణ్య క్షేత్ర దర్శనాలకు వెళ్లడం జరుగుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అక్టోబర్ ప్రథమార్థం బాగానే గడిచిపోతుంది కానీ, ద్వితీయార్థం అనుకూలంగా ఉండకపోవచ్చు. ద్వితీయార్థంలో ఆర్థిక వ్యవహారాలు బాగా ఇబ్బందికలిగిస్తాయి. అక్టోబర్ ద్వితీయార్థంలో శుక్రుడు చతుర్థ స్థానంలోకి మారుతున్నందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.  కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. కొందరు ఉద్యోగులకు విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తు తాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అక్టోబర్ నెలంతా భాగ్య, ధన స్థానాలు బలంగా ఉంటున్నందువల్ల ధనపరంగా సమస్యలన్నీ చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదే శాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగు తాయి. కుటుంబ సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలి తాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.  కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ నెలలో శుభ గ్రహాల అనుకూలతలు బాగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవి తంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ప్రతి పనీ తేలికగా పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగు లకు నూతన ఉద్యోగ యోగం పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసు కుని అనుకున్నవి సాధిస్తారు. విద్యార్థులకు కొద్ది శ్రమతో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహా రాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ  నెలంతా ఒక్క గురు గ్రహమే అనుకూలంగా ఉంటున్నందువల్ల ఆదాయ పరిస్థితి మాత్రం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితులు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొద్ది శ్రమతో ఫలిస్తాయి.  ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి.  పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ నెలంతా గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగు పడుతుంది. కుటుంబ జీవితం కూడా ఈ నెలంతా చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయ త్నమూ లాభదాయక ఫలితాలనిస్తుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు విజయ వంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. లాభ స్థానం బలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాలు విశేషంగా లాభాలను గడిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో చకచకా పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు  చక్కబడతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ నెలంతా ఈ రాశివారికి సంతృప్తికరంగా, సంతోషంగా సాగిపోతుంది. దాదాపు ప్రతి గ్రహమూ అనుకూలంగా మారుతోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. నెల మధ్యలో కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అది మినహా ఇతర గ్రహాల అనుకూలతల వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇంట్లో శుభ కార్యం జరపడానికి అవకాశం ఉంది. కుటుంబ అవసరాల మీద భారీగా ఖర్చు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచి‍ది. ప్రయాణాలు అంత సౌకర్యవంతంగా సాగక పోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగి పోతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ నెలలో చతుర్థ, భాగ్య స్థానాల బలం బాగా పెరుగుతోంది. ఫలితంగా వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో కూడా యాక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు చకచకా పూర్తవుతాయి. కొత్త వ్యాపారాలు, షేర్ల మీద పెట్టుబడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన  ఆల యాలు సందర్శిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహా రాల్లో ఇబ్బందులుంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు అనుకోని పరిష్కారం లభిస్తుంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ నెల ద్వితీయార్థం నుంచి ఈ రాశివారికి యోగాలు పట్టడం ప్రారంభిస్తాయి. శుక్రుడు భాగ్య స్థానంలో ప్రవేశించడం, దాన్ని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలో ప్రతిభా పాటవాలు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందుల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచే కాక, సహచరులు, సన్నిహితుల నుంచి కూడా ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శిస్తారు. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

12 / 12
Follow us