- Telugu News Photo Gallery Spiritual photos Navratri 2022: durga puja crowd of spectators in the kolkata puja pandals light lit up glimpses of culture
Navratri 2022: నవరాత్రులకు తమ సంస్కృతి, సంప్రదాయాలకు కళారూపం ఇచ్చి మండపాలను ఏర్పాటు చేసుకున్న బెంగాలీలు
నవరాత్రుల ఉత్సవాలు అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది కోల్‌కతా.. దుర్గాపూజలో థీమ్ ఆధారిత పూజా పండళ్లలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. నగరంలోని అనేక దుర్గా పూజ కమిటీలు ఈ సంవత్సరం తమ పండల్‌ల కోసం సాంప్రదాయ ఇతివృత్తాల ఆధారంగా చేసుకుని ఏర్పాటు చేశాయి.
Updated on: Sep 30, 2022 | 8:55 PM

బెంగాల్‌లోని జరిగే నవరాత్రి ఉత్సవాలకు యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తింపునిచ్చింది. పూజా పండళ్లలను లైట్లతో అలంకరించారు. ఈ ఉత్సవాల్లో ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలతో నూతనత్వాన్ని వెతుక్కుంటూ సంబంధాన్ని కోల్పోతున్నారని వారు విశ్వసిస్తున్నారు.

బోసెపుకూర్ షీట్ల మందిర్‌లో కమిటీ అధ్యక్షురాలు కాజల్ సర్కార్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న భూస్వామి ప్యాలెస్‌లో 'ఏకాచల్ ప్రతిమ' (ఫ్రేమ్‌పై అమర్చిన దేవతల విగ్రహాలు)ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పండల్ మధ్యలో ఒక ‘నట్మందిర్’ (ఆలయం) స్థాపించబడింది. పునర్నిర్మాణంలో ఉన్న జమీందార్ ప్యాలెస్ లాగా ఏర్పాటు చేయబడింది. శిథిలాల కుప్పల మధ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికే ప్రశంసలు అందుకుంది. మార్పుతో తమ పురాతన కాలం నాటి కళాఖండాలు, చరిత్రపూర్వ శిల్పాల గురించి నేటి తరానికి తెలియడం లేదని..మన నాగరికతపై ఆసక్తిని పునరుద్ధరించడానికి" ఇలాంటి మండపాలు ఉపయోగపడతాయని చెప్పారు.

SB పార్క్, ఠాకూర్‌పుకూర్, బిష్ణుపూర్ టెర్రకోట కళాకృతులు ఈ సంవత్సరం పండల్‌కు ఇరువైపులా అలంకరించారు. హుగ్లీలోని బాలాగఢ్ గ్రామానికి చెందిన కళాకారులచే తయారు చేయబడిన ఒక పడవ కూడా పండల్‌లో అమర్చబడింది. దాని కింద ప్రవహించే నీటిని చిత్రీకరించడానికి ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేయబడ్డాయి. SB పార్క్ పూజా ప్రతినిధి సంజయ్ మజుందార్ మాట్లాడుతూ, “యునెస్కో బృందాలు సెప్టెంబర్ 22, 23 తేదీలలో తమ పండల్‌ను సందర్శించాయి. యునెస్కో ట్యాగ్ పొందడంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ పరిశోధకుడు తపతి గుహ ఠాకుర్తా పూజను ప్రారంభించారు.

మరికొన్ని పండళ్లు 3D ఆకృతిని సంతరించుకుని వినోదాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ మెటావర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన 'స్పేషియల్'లోని వినియోగదారులు షేర్డ్ సోషల్ స్పేస్‌లోకి ప్రవేశించవచ్చు. నలుమూలల నుండి ప్రజలు ఒకచోట చేరి పూజించవచ్చు, సంభాషించవచ్చు, ఫోటోలను కూడా తీసుకోవచ్చు. వినియోగదారులు నిమిషాల్లో తమకుతామే మెటా-రియలిస్టిక్ అవతార్‌ను సృష్టించగలరు. స్మార్ట్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు వంటి వాటి ద్వారా అందరికీ అందుబాటులో ఉంటుందని మెటాఫార్మ్ సహ వ్యవస్థాపకుడు సువీర్ బజాజ్ చెప్పారు. ఇప్పుడు మీరు పూజ జరుపుకోవడానికి కోల్‌కతాలో ఉండాల్సిన అవసరం లేదు. మేటా పూజ ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు మెటా ట్విన్స్ పండల్‌లోకి ప్రవేశించవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు - భౌతికంగా దూరంగా ఉన్నా ఈ మెటా ఫెస్టివల్‌లో ఏకం అయ్యే అవకాశం ఉంటుంది."




