- Telugu News Photo Gallery Spiritual photos Mercury transit brings financial benefits to people of five zodiac signs
బుధ సంచారం.. ఈ రాశుల వారికి చేతినిండా డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రంలో రాశుల సంచారం లేదా గ్రహాల సంచారం సహజం. అయితే ఆగస్టు30న బుధ గ్రహం సింహరాశిలోకి సంచారం చేయనుంది. సింహ రాశికి అధిపతి సూర్యుడు. అటువంటి రాశిలో బుధ గ్రహం సంచారం వలన కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Updated on: Aug 09, 2025 | 2:00 PM

మీన రాశి : మీన రాశి వారికి బుధ సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానున్నదంట. వీరికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వీరు కోరుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అన్ని పనులు అనుకున్న సమయానికి నెరవేరుతాయి.

తుల రాశి : తుల రాశి వారు బుద గ్రహం అనుగ్రహం వలన మంచి ఉద్యోగంలో చేరుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బుధ సంచారం అద్భుతమైన లాభాలు తీసుకొస్తుంది.వీరు తమ తెలివితో అన్నింటా మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం.

కన్యా రాశి : కన్యా రాశి వారి వ్యాపారస్తులకు ఇది చాలా అద్భుతమైన సమయం అనే చెప్పాలి. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఎంత కష్టమైన పనులైనా సరే బుధ గ్రహం అనుగ్రహంతో త్వరగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.



