- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: These are the mistakes that a person should not make while alive
చాణక్య నీతి : బతికి ఉన్నప్పుడు ఈ పాపాలు చేశారా.. మరణం తర్వాత కష్టమే!
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. ఈయన గొప్ప పండితుడు. అనేక విషయాలపై మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి.చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాల గురించి వివరించడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
Updated on: Aug 09, 2025 | 2:01 PM

ఇక చాణక్యుడు తన అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి చాలా విషయాలను తెలిపిన విషయం తెలిసినదే. అయితే ఒక వ్యక్తి జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలాంటి మంచి అల వాట్లను అలవరుచుకోవాలి. సక్సెస్ కోసం ఏం చేయాలి. ఇలా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

అదే విధంగా చాణక్యుడు, ఒక వ్యక్తి బతికి ఉన్నప్పుడు ఎలాంటి పాపాలు చేయకూడదు అనే విషయాన్ని వివరంగా తెలియజేశాడు. ఆయన జీవితంలో మనం చేసే కొన్ని తప్పులే మన జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తాయి, కొన్ని తప్పులు మనం మరణించిన తర్వాత కూడా అవి మనల్ని వదలవు అని చెప్పుకొచ్చాడు కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆచార్య చాణక్యుడు మోసం చేయడం మహాపాపం అని చెప్పుకొచ్చారు. అది స్నేహం, కుటుంబం లేదా పని సంబంధం ఏదైనా కావచ్చు, మీరు ఎవరినైనా మోసం చేస్తే మీరు దానికి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఎప్పటికీ మనశ్శాంతి లభించదని తెలిపారు.

మన పెద్ద వారు చెబుతుంటారు. అబద్ధం చెప్పకూడదని, అయితే ఒక వ్యక్తి పదే పదే అబద్ధం చెప్పడం కూడా మహాపాపం అంట. మీరు పదే పదే అబద్ధాలు చెప్పడం వలన తర్వాత మీ మాటలు ఎవ్వరూ నమ్మరు. కొన్ని రోజుల తర్వాత అసలు నిజం బయటకు వస్తుంది. దీంతో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆచార్య చాణక్యుడు చేయకూడని పాపాల గురించి తెలియజేస్తూ, ఒక వ్యక్తి తమ జీవితంలో వేరొకరి భార్య లేదా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు. అది మీ జీవితంలో మహాపాపంగా మిగిలిపోతుంది. దీని వలన వ్యక్తి సమాజంలో గౌరవం కోల్పోయి, ఎప్పుడూ కష్టాలతో బతకాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు.



