- Telugu News Photo Gallery Spiritual photos Mars transiting into the star brings benefits to those of the four zodiac signs
హమ్మయ్యా.. కష్టాలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం!
జ్యోతిష్య శాస్త్రంలో కుజగ్రహానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. కుజుడు సరైన స్థానంలో ఉం టే ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అని చెబుతారు. అయితే మరో నాలుగు రోజుల్లో కుజుడు నక్షత్ర సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి కష్టాలన్నీ తొలిగిపోయి, పట్టిందల్లా బంగారమే కానున్నది.
Updated on: Aug 09, 2025 | 2:00 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది కామన్. గ్రహాలు రాశులు లేదా, నక్షత్ర సంచారం చేస్తుంటాయి. దీని వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి కష్టాలు నష్టాలు వస్తుంటాయి. అయితే ఆగస్టు13న కుజ గ్రహం హస్త నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి కష్టాలు తొలిగి పోయి , మంచి రోజులు ప్రారంభం కానున్నాయి.

సింహ రాశి : సింహ రాశి వారికి కుజ సంచారం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా వీరికి వృత్తిపరమైన జీవితంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.వ్యాపారంలో అనేక లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కష్టాలన్నీ తీరిపోవడంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు

తుల రాశి : తుల రాశుల వారు చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యల నుంచి సతమతం అవుతే వాటి నుంచి బయటపడతారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి.

వృషభ రాశి : వృషభ రాశి వారికి కుజ గ్రహం హస్త నక్షత్ర సంచారం వలన ఊహించని లాభాలు చేకూరుతాయి. అలాగే వీరికి కెరీర్‌కు సంబంధించిన అంశాల్లో విశేషమైన లాభాలు చేకూరుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆటంకాలు తొలిగిపోయి ఆనందంగా గడుపుతారు.

మేష రాశి : మేష రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. అలాగే వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అన్ని పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి, అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి.



