AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani Dev: ఈ రాశుల వారికి శని దోషం.. పరిహారాలు ఏంటో తెలుసుకోండి..!

Shani Dosha: జ్యోతిషశాస్త్రం శనీశ్వరుడిని అత్యంత పాప గ్రహంగా పరిగణిస్తుంది. శని శుభుడైనా, అశుభుడైనా కొద్దో గొప్పో ఇబ్బంది పెట్టకుండా ఉండడని కూడా జ్యోతిష పండితులు కూడా చెబుతుంటారు. నిజానికి, కర్మకారకుడైన శనీశ్వరుడు అనుకూలంగా ఉన్న పక్షంలో తప్పకుండా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. శని మితిమీరిన క్రమ శిక్షణను ఆశిస్తాడు. నిరాడంబరత, నిస్వార్థత, వినయ విధేయతలు, నిజాయతీ శనికి బాగా నచ్చే లక్షణాలు. ఈ లక్షణాలను అనుసరించడం వల్ల శని దోషం బాగా తగ్గే అవకాశం ఉంది. శని దోషానికి ఇతర పరిహారాలన్నిటి కంటే శివార్చనే అత్యుత్తమ పరిహారమని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం శని దోషం అనుభవిస్తున్న మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 18, 2025 | 7:27 PM

Share
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో, అంటే 12వ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఏలిన్నాటి దోషం కలిగింది. శని వ్యయ స్థాన సంచారం వల్ల ఏదో ఒక అనారోగ్యం పీడించే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా పెరుగుతాయి. శ్రమ, తిప్పట, అనవసర వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో రూపేణా ధన నష్టం జరుగుతూ ఉంటుంది. పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. ఇవి తగ్గుముఖం పట్టాలన్న పక్షంలో ఈ రాశివారు శనికి ప్రదక్షిణలు చేయడం, తరచూ శివార్చన చేయడం మంచిది.

1 / 7
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. కింది ఉద్యోగులు పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా యాక్టివిటీ బాగా తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రభావం తగ్గాలన్న పక్షంలో తరచూ శివాలయాన్ని సందర్శించడం, శివార్చన చేయించడం చాలా మంచిది.

2 / 7
సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ‘అష్టమ శని’ దోషం కలిగింది. దీనివల్ల ప్రతి పని లోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు వృద్ధి చెందుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. రుణ దాతల ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అసంతృప్తి  పెరుగుతుంది. శివార్చన చేయించడంతో పాటు, నువ్వులు, మినుములు దానం చేయడం చాలా మంచిది.

3 / 7
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో పురోగతి ఆగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. కుటుంబ, వైవాహిక సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు. శివార్చన చేయించడం, శనికి ప్రదక్షిణలు చేయడం వల్ల వీటి నుంచి విముక్తి కలుగుతుంది.

4 / 7
ధనుస్సు: ఈ రాశికి నాలుగవ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత, సుఖ సంతోషాలు తగ్గుతాయి. ఆస్తి వ్యవహారాలు వివాదాల్లో చిక్కుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంవారు అనేక విధాలుగా కష్టనష్టాలను అనుభవించాల్సి వస్తుంది. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి బయటపడటానికి తరచూ శివార్చనతో పాటు శనీశ్వరుడికి దీపం వెలిగించడం మంచిది.

5 / 7
కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. ఎంత కష్టపడ్డా ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు ఒక పట్టాన పరిష్కారం కాకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. మాటకు విలువ తగ్గుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. తరచూ శివార్చన చేయించడంతో పాటు నల్ల రంగు కలసిన దుస్తులను ధరించడం మంచిది.

6 / 7
మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల అనారోగ్య సమస్యలు బాగా పీడిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, ప్రయత్నాల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలతో కూడా ఇబ్బంది పడతారు. ఏ విషయంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఉద్యోగంలో పొరపాట్లు ఎక్కువగా జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. తరచూ శివారాధన చేయడంతో పాటు, నల్ల రంగు కలిసిన దుస్తులు ఎక్కువగా ధరించడం మంచిది.

7 / 7