వృషభం: ఈ నాలుగవ స్థానంలో ఉన్న శుక్రుడు, ప్రస్తుతం అయిదవ స్థానంలో ఉన్న రవి, బుధుల వల్ల వ్యక్తిగత జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో వేగం, యాక్టివిటీ పెరుగు తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తల్లితండ్రుల చేయూత లభిస్తుంది.