- Telugu News Photo Gallery Spiritual photos Do you know which are the tallest temple towers in the India?
Tallest Temple Towers: ఈ ఆలయ గోపురాలు దేశంలోనే ఎత్తైనవి.. అవేంటో తెలుసా.?
భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. వాటికీ ప్రతి ఏడాది లక్షల్లో భక్తులు తరలి వస్తారు. అయితే ప్రతి ఆలయం వాటి ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. కొన్ని టెంపుల్స్ ప్రపంచంలో అతి ఎత్తైన గోపురాలను ఉంటాయి. అందులో టాప్ 10 భారతీయ గోపురాలు ఏంటి.? ఈరోజు ఈ స్టోరీలో మనం చూద్దాం..
Updated on: Jun 08, 2025 | 2:19 PM

ఇందులో తోలి స్థానంలో ఉంది. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. 239 అడుగుల ఎత్తులో మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ జాబితాలో కర్ణాటక మురుడేశ్వర్ ఆలయం టాప్ 2లో ఉంది. ఇది భారతదేశంలో రెండవ ఎత్తైన శివ విగ్రహానికి నిలయం, 237 అడుగులు ఎత్తున్న ఈ ఆలయం తీరప్రాంత దృశ్యాలు ఆకర్షిస్తాయి.

ఈ జాబితా థర్డ్ ప్లేస్లో నిలిచింది పూరి జగన్నాథ ఆలయం. ఇది చార్ ధామ్ ప్రదేశాలలో ఒకటి. ప్రత్యేకమైన రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ ఎత్తు 214 అడుగులు. 11వ శతాబ్దంలో అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన తంజావూరు బృహదీశ్వర ఆలయం ఎత్తు 212 అడుగులు. ఇది నాలుగవ స్థానంలో ఉంది.

తర్వాత టాప్ 5లో నిలిచింది తిరువణ్ణామలై (అరుణాచలం)లోని అన్నామలైయార్ ఆలయం. కార్తిగై దీపానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శివుని రూపానికి అంకితం చేయబడింది. 217 అడుగులు ఎత్తు ఉంటుంది. టాప్ 6 విషయానికి వస్తే.. కాంచీపుర ఏకాంబరేశ్వర ఆలయం సొంతం చేసుకుంది. దేవాలయం ఎత్తు 194 అడుగులు. ఇది పృథ్వి లింగ ఆలయం.

భువనేశ్వర్ లింగరాజ ఆలయం ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ అయిన ఈ దేవాలయం ఎత్తు 180 అడుగుల. 180 అడుగుల ఎత్తుతో పంధర్‌పూర్ విఠల్ రుక్మిణి ఆలయం 8వప్లేస్లో ఉంది. ఆషాధి ఏకాదశి పండుగ సందర్భంగా ఈ ఆలయనికి లక్షలాది మంది భక్తులు వెళ్తారు.

ఈ లిస్టులో 9వ స్థానంలో ఉంది 14 రంగుల గోపురాలతో తమిళ సంస్కృతిని ప్రదర్శించే 170 అడుగుల మీనాక్షి ఆలయం. చివరగా టాప్ 10లో ఉంది మన్నార్గుడి రాజగోపాలస్వామి ఆలయం. ఈ గొప్ప విష్ణు ఆలయం అద్భుతమైన శిల్పాలు ఎత్తైన గోపురం కలిగి ఉంది. దీని ఎత్తు 154 అడుగులు.



















