- Telugu News Photo Gallery Spiritual photos Chandra Grahan 2025: do these remedies before and after lunar eclipse
Chandra Grahan 2025: చంద్రగ్రహణం ముందు, తర్వాత ఈ పనులు చేయండి.. గ్రహణ దోషం నుంచి బయటపడండి..
హిందువులకు గ్రహణాల విషయంలో ప్రత్యేక నమ్మకాలు ఉన్నాయి. అందుకనే గ్రహణ సమయంలో తినడం, తాగడం మాత్రమే కాదు కొన్ని రకాల పనులను కూడా చేయరు గ్రహణ సమయాన్ని అశుభకరంగా పరిగణిస్తారు. అంతేకాదు గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి.. గ్రహణం విడిచిన తర్వాత కొంత సమయం వరకూ సూతక కాలంగా పరిగనిస్తారు. ఈ సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం ఈ నెల 7వ తేదీన ఏర్పడనుంది. ఈ నేపధ్యంలో గ్రహణానికి ముందు.. తర్వాత చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Sep 05, 2025 | 3:52 PM

2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ నెల 7వ తేదీ భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంభవించనుంది. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కూడా.. ఈ చంద్ర గ్రహణం మన దేశంలో కూడ కనిపించనుంది. సంపూర్ణ చంద్ర గ్రహణాన్నిఖగోళ దిగ్విషయం శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా విశేషమైన ప్రాముఖ్యత ఉంది.

కుంభ రాశిలో ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్త వహించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణానికి ముందు, తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

చంద్రగ్రహణం సమయంలో రాహువు అశాంతి శక్తిని సమతుల్యం చేయడానికి.. ధ్యానం చేసి మంత్రాలను జపించండి. ఈ సమయంలో దేవుని నామాన్ని జపించడం, భజనలు లేదా మంత్రాలను జపించడం శుభప్రదం. ఫలవంతమైనది. గ్రహణం సమయంలో విష్ణువు, శివుడు లేదా హనుమంతుడి మంత్రాలను జపించండి.

గ్రహణం సమయంలో పూజలు చేయవద్దు .. ఆర్థిక లేదా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. గ్రహణం సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. భావోద్వేగానికి గురికావద్దు. ఇంట్లోని అన్ని వస్తువులపై దర్భలను లేదా తులసి దళాలను వేసుకోవాలి.

చంద్రగ్రహణం సూతక కాలంతో ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12.57 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు లేదా పూజలు చేయకూడదు, ఆలయాల తలుపులు మూసి వేయాలి. ఇంట్లో పూజ గదిని కూడా ముసివేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత.. అన్ని వస్తువులపై గంగా జలాన్ని చల్లి వాటిని శుద్ధి చేయాలి.

గ్రహణం తర్వాత దానం చేయండి. చంద్ర గ్రహణం కనుక తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. అందుకే గ్రహణం ముగిసిన తర్వాత పాలు, బియ్యం, చక్కెర దానం చేయండి. ఇవన్నీ అవసరమైన వారికి ఇవ్వండి.




