- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti: These 6 Things You Should Never Delay If You Want Success in Life in telugu
Chanakya Niti: ఈ 6 విషయాలను వాయిదా వేసే మనిషి జీవితంలో విజయం ఎండమావే
ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో ఈ ఆరు పనులను ఆలస్యం చేయడం వైఫల్యానికి దారితీస్తుందని పేర్కొన్నాడు. ఈ ఆరు పనులను వాయిదా వేయడం నాశనాన్ని ఆహ్వానించడం లాంటిదని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్పష్టంగా తెలిపాడు. సమయం ప్రాముఖ్యతను వివరించే ఆచార్య చాణక్యుడి విధానాల గురించి తెలుసుకోండి.
Updated on: Sep 26, 2025 | 8:02 AM

జీవితంలో సమయం గొప్ప ఆస్తి అని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. సరైన సమయంలో సరైన పనులు చేసేవారు మాత్రమే విజయాన్ని తద్వారా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. అయితే ముఖ్యమైన పనులను వాయిదా వేసే వారి జీవితాలు క్రమంగా పోరాటం , వైఫల్యంతో నిండిపోతాయి. కొన్ని పనులను ఆలస్యం చేయడం వినాశనానికి సమానమని చాణక్య నీతి స్పష్టంగా పేర్కొంది.

విద్యను పొందడం: చాణక్య నీతి ప్రకారం జ్ఞానం ఒక వ్యక్తికి ఉన్న గొప్ప సంపద. ఒక వ్యక్తి సకాలంలో విద్యను పొందలేకపోతే తరువాత జీవితంలో దాని గురించి పశ్చాత్తాపపడాల్సి వస్తుంది.

వివాహం చేసుకోవడానికి: సరైన వయసులో వివాహం చేసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆలస్య వివాహం వల్ల సామాజికంగానే కాదు మానసిక, కుటుంబ సమస్యలు కూడా పెరుగుతాయి.

పిల్లలు: పిల్లలను కనడం సకాలంలో జరగాలని చాణక్య నీతి తెలియజేస్తుంది. పిల్లల జన్మ విషయంపై అనవసరమైన జాప్యం తీసుకుంటే తరువాత ఆరోగ్య, సంబంధాల మధ్య సమస్యలకు దారితీయవచ్చు.

అప్పు తిరిగి చెల్లించడం: అప్పు చెల్లించడాన్ని ఎప్పుడూ వాయిదా వేయకూడదని చాణక్యుడు నమ్మాడు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేస్తే.. అది మీ జీవితాంతం మిమ్మల్ని వెంటాడే భారంగా మారుతుంది. మీ ప్రతిష్టను కూడా ప్రభావితం చేస్తుంది.

చెడును నాశనం చేయడం: కుటుంబ సభ్యుల్లో లేదా సమాజంలో చెడు అలవాట్లు ఉంటే వెంటనే వాటిని దూరం చేసే ప్రయత్నం చేయాలి. అదే విధంగా శత్రుత్వం ఉన్నా.. దానిని సకాలంలో నిర్మూలించాలి. ఇలాంటి విషయాలను ఆలస్యం చేయడం వల్ల పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది.

ఆధ్యాత్మిక, దాతృత్వ కార్యకలాపాలు: చాణక్య నీతి ప్రకారం మతపరమైన, ధర్మబద్ధమైన పనులను ఎప్పుడూ వాయిదా వేయకూడదు. ఎందుకంటే ఒకసారి అవకాశం కోల్పోతే పశ్చాత్తాపం మాత్రమే కలుగుతుంది. జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుంది

ఆచార్య చాణక్యుడి కొన్ని వందల ఏళ్ల క్రితం చెప్పిన ఈ సూత్రాలు నేటికీ అంతే సందర్భోచితంగా ఉన్నాయి. ఈ ఆరు పనులను ఆలస్యం చేయని వ్యక్తి జీవితంలో ఆనందం, గౌరవంతో పాటు విజయ శిఖరాలను అధిరోహిస్తాడు.




