- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu if a person remains alert in these situations then he can avoid all future troubles
Chanakya Niti: ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి అప్రమత్తంగా ఉంటే.. భవిష్యత్తులో ఏర్పడే సమస్యలను పరిష్కరించుకోవచ్చు
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చిన్నతనంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. తక్షశిలలో విద్యాభ్యాసం చేసి.. అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. తన జీవిత అనుభవాలను నీతి శాస్త్రంలో పొందుపరిచాడు. నేటి మనవ జీవితానికి ఎంతో ఉపయోకరమైనవని పెద్దల నమ్మకం.
Updated on: Apr 01, 2022 | 9:18 AM

ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా జీవితంలో ప్రతి మనిషికి ఎదురయ్యే కొన్ని పరిస్థితులను వివరించాడు. వీటి గురించి ఒక వ్యక్తి అవగాహన కలిగి ఉంటే, భవిష్యత్తులో అనేక ఇబ్బందులను నివారించవచ్చు. 'దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం జలం పిబేత్| సత్యపూతాం వదే ద్వాచం మనఃపూతం సమాచరేత్ ||' అని ఆచార్య చెప్పారు.

ఈ శ్లోకం ద్వారా, ఆచార్య చాణక్యుడు జీవితంలో ముందుకెళ్తున్న సమయంలో.. మీ దృష్టిని సరిగ్గా ఉంచుకోవాలని సూచించాడు. జీవితంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వ్యక్తులు తరచుగా పొరపాట్లు చేస్తుంటే.. ప్రమాదానికి గురవుతారు. కనుక నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీంతో మీరు ఇబ్బందులను నివారించవచ్చు.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. నీరు శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనుక నీటిని ఎప్పుడూ గుడ్డలో వడకట్టి తాగాలి. కలుషిత నీరు మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుంది. పూర్వ కాలంలో నీటిని శుభ్రం చేయడానికి ఎటువంటి మార్గాలు లేవు. అప్పుడు నీటిని గుడ్డ ద్వారా ఫిల్టర్ చేసేవారు. నేడు, వాస్తవానికి, నీటిని శుభ్రపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఆచార్య చాణక్య చెప్పిన ఈ ముందు జాగ్రత్త నేటికీ అనుసరణీయం.

ఏదైనా పనిని ప్రారంభించే ముందు.. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోండి. అంచనా వేయండి. ఆపై ఆ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకోండి. కానీ మీరు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే.. ఆ పనిని హృదయ పూర్వకంగా పూర్తి చేయండి. చేపట్టిన పనిని ఎట్టి పరిస్థితుల్లొనూ మధ్యలో వదిలేయకండి. అప్పుడే మీరు విజయం సాధించగలరు.

అబద్ధాలను ఆశ్రయించాల్సిన అని ఏదైనా సరే చేయకండి. ఒక్క అబద్ధాన్ని దాచాలంటే ఎన్నో అబద్ధాలు చెప్పాలి. అలాంటి వ్యక్తి ఏదో ఒకరోజు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడు





























