జీవితంలో స్నేహితుల పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉన్నందువల్ల సహజంగా మనకు ఎటువంటి స్నేహితులు లభిస్తారు అన్న అంశం మీద ఆసక్తి కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో స్నేహాలకు సంబంధించినంత వరకు 11వ స్థానానికి, గురు గ్రహానికి ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా వృషభం, కన్య, మకర రాశులకు చెందిన వారు స్నేహం కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశులలో ఉన్న గ్రహాలు కూడా స్నేహానికి అనుకూలంగా మారుతాయి. ఇదంతా కూడా వ్యక్తిగత జాతక చక్రాలలోని గ్రహాల స్థితి గతుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వివిధ రాశులకు స్నేహ సంబంధాలు ఎలా ఉండబోయేది ఇక్కడ పరిశీలిద్దాం.