- Telugu News Photo Gallery Spiritual photos Astrology 2025: 6 Zodiac Signs Overcome Job and Business Competitors Details in Telugu
Telugu Astrology: కుజ, గురు అనుకూలత.. ఈ రాశుల వారికి శత్రువుల మీద విజయం!
ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా అనేక రూపాలలో, అనేక విధాలుగా పీడించే విరోధుల మీద విజయం సాధించడానికి ఈ ఏడాది కొన్ని రాశుల వారికే అవకాశం ఉంది. విరోధులు, శత్రువులు, పోటీదార్లు, ప్రత్యర్థులు వగైరా పేర్లతో వీరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం, ఆటంకాలు సృష్టించడం జరుగుతుంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో ఆరవ స్థానాన్ని బట్టి ఈ విరోధుల గురించి చెప్పడం జరుగుతుంది. కుజ, గురు గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉండే పక్షంలో శత్రు బాధ చాలావరకు తగ్గుతుంది. వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు ఈ విరోధుల మీద పైచేయి సాధించే అవకాశం ఉంది.
Updated on: Oct 18, 2025 | 3:12 PM

వృషభం: ఈ రాశికి రాశినాథుడైన శుక్రుడే ఆరవ స్థానాధిపతి కూడా అయినందువల్ల సాధారణంగా ఈ రాశి వారికి సొంతవారే విరోధులుగా తయారై అడుగడుగునా అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఆరవ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగంలో విరోధులు, వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధించే అవకాశం ఉంది. వెనుక నుంచి కుట్రలు కుతంత్రాలు చేసే వారు బయటపడే అవకాశం ఉంది. ఈ రాశివారు అనేక విధాలుగా విజయాలు సాధించడం జరుగుతుంది.

కన్య: ఈ రాశివారికి కూడా ఆరవ స్థానాధిపతి శనీశ్వరుడు అయినందువల్ల విరోధులు తక్కువగా ఉండడం జరుగుతుంది. విరోధులుంటే మాత్రం శక్తివంతులై ఉండే అవకాశం ఉంది. అయితే, శనీశ్వరుడు అనుకూలంగా ఉండడంతో పాటు, ఆరవ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ ఏడాది ఈ రాశివారికి విరోధులు సమస్యలు తెచ్చిపేట్టే అవకాశం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా వీరికి విరోధులు, పోటీదార్ల వల్ల బాగా కలిసి వస్తుంది. ఎటువంటి శత్రువైనా తగ్గి ఉంటారు.

తుల: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి గురువు అయినందువల్ల పెద్ద మనుషులు ముసుగులో వీరికి విరోధులు చుట్టుపక్కలే ఉంటారు. సాధారణంగా వీరిని చూసి అసూయపడే వారి సంఖ్య కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఆరవ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల విరోధుల మీద పైచేయి సాధించే అవకాశం ఉంది. పోటీదార్ల కుట్రలు, కుతంత్రాలు పని చేసే అవకాశం లేదు. వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు సృష్టించేవారు వెనుకడుగు వేసే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి శుక్రుడు అయినందువల్ల ఇతర జెండర్ నుంచి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. పురుషులైతే స్త్రీలు, స్త్రీలైతే పురుషులు విరోధులుగా మారే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఇతర జెండర్ల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారిని చూసి అసూయపడే సహోద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంటుంది. ప్రస్తుతం శుక్ర గ్రహం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరించడం జరుగుతుంది.

మకరం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి బుధుడు అయినందువల్ల దగ్గర బంధువులు, సహోద్యోగులు, పోటీదార్లు విరోధుల పాత్ర పోషిస్తుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రాశివారి పనితీరు ఇత రుల్లో అసూయ కలగజేస్తూ ఉంటుంది. వీరు పనిచేసే సంస్థల్లోని అధికారులు సైతం వీరిని చూసి అసూయపడే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఆరవ స్థానంలో గురువు సంచారం వల్ల వీరి మీద ఎటువంటి కుట్రలు, కుతంత్రాలు పనిచేసే అవకాశం లేదు. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు.

కుంభం: ఈ రాశివారికి చంద్రుడు ఆరవ స్థానాధిపతి అయినందువల్ల వీరికి తాత్కాలిక విరోధులే తప్ప శాశ్వత విరోధులు ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు వీరిని మధ్య మధ్య ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంటుంది. అయితే, ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఉచ్ఛ గురువు ప్రవేశిస్తున్నందువల్ల వీరి మీద విరోధులు విజయాలు సాధించకపోవచ్చు. ఈ రాశివారు ఎటువంటి వారినైనా ఎదుర్కుని నిలబడగలుగుతారు.



