- Telugu News Photo Gallery Spiritual photos Are you putting these on the fridge? They cause problems at home
Vastu Tips: ఫ్రిజ్‌పై వీటిని పెడుతున్నారా.? ఇంట్లో సమస్యలకు కారణం..
హిందూ మతంలో, ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వాస్తు నియమాల ప్రకారం నిర్మించిన ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, సానుకూలత ఉంటుందని నమ్ముతారు. అలాగే వాస్తు ప్రకారం.. రిఫ్రిజిరేటర్ మీద కొన్ని వస్తువులు పెట్టకూడదు అవేంటో ఈరోజు తెలుసుకుందాం..
Updated on: May 31, 2025 | 2:01 PM

తరచుగా మనం ఫ్రిజ్ పైన ఏదో ఒకటి ఉంచుతాం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఫ్రిజ్ పైన కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్‌లో ఉంచకండి, చెడు రోజులు మొదలవుతాయి!

వెదురు మొక్క: ఈ మొక్క పవిత్రమైనదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇది ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. వెదురు మొక్క ఇంటికి ఆనందం, అదృష్టం, కీర్తి, ప్రశాంతత, డబ్బును తెస్తుంది. దీనిని బహుమతిగా ఇవ్వొచ్చు. దీనితో ఇల్లు, ఆఫీస్ డెస్క్‌ని అందంగా చేయవచ్చు. ఈ మొక్క ఉన్న చోట సంపద, సౌఖ్యం ఉంటుందని శాస్త్రం వివరిస్తోంది. చాలా మంది వారి ఇంటి ఆవరణలో పొడవైన వెదురు మొక్కలు పెంచుకుంటారు.

అలంకరణ కోసం ఫ్రిజ్‌పై ట్రోఫీలు లేదా అవార్డులను కూడా ఉంచుతారు. ఇది అస్సలు చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఫ్రిజ్ పైన ఏదైనా వస్తువు ఉంచడం అశుభం అని చెబుతున్నారు హిందూ పండితులు.

బంగారం, వెండి వస్తువులు లేదా డబ్బును పొరపాటున కూడా ఫ్రిజ్ పైన ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దీనితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ఉంది.

మందులను రిఫ్రిజిరేటర్ పైన ఉంచడం వల్ల వాటి ప్రభావం పోతుంది. దీనితో అనారోగ్యం బారిన పడతారు. రిఫ్రిజిరేటర్ నుండి వెలువడే వేడి ఔషధాలపై ప్రభావం చూపుతుందని సైన్స్ చెబుతోంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, రిఫ్రిజిరేటర్ ఉంచడానికి పశ్చిమ దిశ మంచిది. ఇది కాకుండా నైరుతి దిశ కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే, రిఫ్రిజిరేటర్‌ను ఎల్లప్పుడూ గోడకు కనీసం ఒక అడుగు దూరంలో ఉంచాలి.




