Shaik Madar Saheb |
Updated on: Apr 24, 2022 | 11:17 AM
చాలా మంది ఇతరులు ఉపయోగించిన వస్తువులను వాడే అలవాటు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ అలవాటు చాలా చెడ్డదిగా పరిగణిస్తారు. దీని కారణంగా ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ఇతరుల నుంచి తీసుకున్న ఏ వస్తువులు ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
గడియారం - జోతిష్య శాస్త్రం ప్రకారం ఎవ్వరి గడియారాన్ని కూడా మరొకరు ఉపయోగించకూడదు. ఒక వ్యక్తి జీవితం అతని కాలానికి సంబంధించినదని విశ్వసిస్తారు. ఎవరైనా ఇబ్బందులు పడి ఉంటే.. మీరు అతని గడియారాన్ని ధరిస్తే ఈ చెడు సమయం మీ జీవితంతో ముడిపడి ఉంటుందని పేర్కొంటున్నారు.
దుస్తులు - ఒక వ్యక్తి ఎప్పుడూ ఇతరుల దుస్తులను ధరించకూడదు. దీని ద్వారా మీరు అవతలి వ్యక్తికున్న ప్రతికూల శక్తి మనకు వస్తుందని పేర్కొంటున్నారు. దీతోపాటు ఇది ఆరోగ్యానికి కూడా హానికరం. ఎందుకంటే మీరు ఇతరుల శరీరం నుంచి హానికరమైన బ్యాక్టీరియా మీకు కూడా వచ్చే సంక్రమించే అవకాశముంది.
బూట్లు, చెప్పులు - ఒక వ్యక్తి ఎప్పుడూ ఇతరుల బూట్లు-చెప్పులను ధరించకూడదు. ఇది మరింత పేదరికాన్ని కలిగిస్తుంది. శని స్థానం పాదాలలో ఉన్నట్లు భావిస్తారు. ఇలా చేయడం వల్ల మరొకరి శని దోషం ప్రభావం మీ జీవితంపై కూడా ఉంటుంది.
ఉంగరం - వాస్తు ప్రకారం ఒక వ్యక్తి మరొకరి ఉంగరాన్ని ధరించకూడదు. ఇది ధరించినవారికి హానికరం. ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి ఆరోగ్యం, ఆర్థిక, జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.